'వెంకీమామ' సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి ఎంతంటే
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా రాబోతున్న మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ విడుదల చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేశారు.
కాగా తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం సినిమా నిడివి 149 నిమిషాల 23 సెకనులుగా ఉంది. వెంకీమామ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, సినిమా చాలా బాగుందని చిత్ర నిర్మాతలను ప్రత్యేకంగా అభినందిస్తూ, చిత్ర యూనిట్‌కు స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపారు.

హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.
''చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన నాగ చైతన్య బాధ్యతలను మేనమామ అయిన వెంకీ తీసుకుంటాడు. కానీ వెంకీ నాన్న ఒక జోతిష్యున్ని అడగ్గా ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయం.. పెరిగి పెద్దయ్యాక ఎప్పటికైనా మేనమామ ప్రాణం మేనల్లుడు చేతిలోనే పోతుంది అని. అది తెలిసి కూడా మేనమామ వెంకీ ఎంతో ప్రేమతో మేనల్లుడిని పెంచుతాడు" అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











