గుడ్ బై చెప్పాలనుకున్నా.. ఎన్టీఆర్, ప్రభాస్‌లతో! అసలు విషయం బయటపెట్టిన వెంకటేష్

ఫ్యామిలీ, ఎమోషన్, కామెడీ, డ్రామా, యాక్షన్ ఎలాంటి సినిమా అయినా సరే అందులో ఒదిగిపోయే హీరో దగ్గుబాటి వెంకటేష్. అందుకే ఆయనకు విక్టరీ అనే బిరుదు ఇచ్చేసింది తెలుగు సినీ పరిశ్రమ. రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అలాంటి విక్టరీ వీరుడి పుట్టిన రోజు ఈ రోజు (డిసెంబర్ 13). ఈ సందర్బంగా ఈ మీడియాతో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. వివరాల్లోకి పోతే..

తెలుగు ఇండ‌స్ట్రీలో తిరుగులేని ప్ర‌యాణం

తెలుగు ఇండ‌స్ట్రీలో తిరుగులేని ప్ర‌యాణం

గత 33 ఏళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో తిరుగులేని ప్ర‌యాణం కొనసాగిస్తున్నారు వెంకటేష్. ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ మూవీస్‌ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ విక్టరీ వీరుడు. కొడుకు హీరో కావాలని తండ్రి కన్న కలలను వెంకటేష్ తీర్చాడు. ఇన్నేళ్ల సినీ ప్రయాణం కొనసాగించాడు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.

 అలా భావిస్తున్నారు.. అందుకే

అలా భావిస్తున్నారు.. అందుకే

వెంకీమామ సినిమా విడుదల, తన పుట్టిన రోజు సందర్బంగా కాసేపు మీడియాతో మాట్లాడిన ఆయన తన కెరీర్ సంగతులు పంచుకున్నారు. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని, హార్డ్ వర్క్‌ను నమ్ముకున్నానని అన్నారు. తనలో ఇంకా విషయం ఉందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని, అందుకే తాను ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నానని వెంకటేష్ పేర్కొన్నారు.

ఐదేళ్ల క్రిందటే గుడ్ బై.. కానీ

ఐదేళ్ల క్రిందటే గుడ్ బై.. కానీ

తాను ఐదేళ్ల క్రిందటే సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నానని, కానీ ఆ అవకాశం దర్శకనిర్మాతలు ఇవ్వడం లేదని అన్నారు వెంకీ. అందుకే ప్రస్తుతం తెలుగులో మిగతా హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నానని వెంకటేష్ చెప్పారు. యంగ్ హీరోలతో ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం కొత్త ఉత్సాహాన్నిస్తోందని ఆయన తెలిపారు.

వెంకటేష్ మనసులో మాట.. ఎన్టీఆర్, ప్రభాస్‌

వెంకటేష్ మనసులో మాట.. ఎన్టీఆర్, ప్రభాస్‌

ఇప్పటికే తాను పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్, రామ్‌‌, నాగ చైతన్యలతో మల్టీస్టారర్ సినిమాలు చేశానని.. ఇంకా ఇలాగే మల్టీస్టారర్ సినిమాలు చేయాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లతో చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు వెంకటేష్.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
వెంకీ కెరీర్‌లో తొలిసారి ఇలా..

వెంకీ కెరీర్‌లో తొలిసారి ఇలా..

ఇక వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన ‘వెంకీ మామ' సినిమా ఈ రోజే (డిసెంబర్ 13)విడుదలయింది. వెంకీ కెరీర్‌లో తొలిసారి ఇలా పుట్టినరోజున ఓ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ్ చైతన్య సరసన రాశి ఖన్నా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X