SAINDHAV: మరో బాంబ్ పేల్చబోతున్న వెంకటేష్.. ఆరోజే ఎందుకు ప్లాన్ చేశాడంటే!

టాలీవుడ్‌లో ఉన్న బడా స్టార్ హీరోస్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన విక్టరీ వెంకటేష్ ఒకరు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. కుటుంబ కథా చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఎన్నో ప్రయోగాలు చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్‌తో అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వెంకటేష్ 'సైంధవ్' అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' అనే సినిమాలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో చాలా కంటైనర్లు ఉన్న ఒక ప్రదేశంలో చేతిలో ఒక బయో డ్రగ్‌ను పట్టుకుని నడుచుకుంటూ కనిపించడం.. ఆ తర్వాత దానితో ప్రత్యర్థులపై దాడి చేసేందుకు గన్‌ను వెతికి తీసుకు రావడం వంటివి చూపించారు. దీంతో ఈ చిత్రం సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతుందని అర్థమై ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

Venkatesh Starrer SAINDHAV Movie Release On December 22nd

దగ్గుబాటి వెంకటేష్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు. దీనిపై ఎలాంటి సమాచారం లేకుండానే తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఇందులో ఈ మూవీని 2023, డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆరోజే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి కారణం 25వ తేదీ సోమవారం క్రిస్మస్ హాలీడే కావడమే అని తెలిసింది. ఇక, తాజాగా వదిలిన పోస్టర్‌లో సైతం వెంకటేష్ చేతిలో గన్, పక్కన బాంబులను అమర్చుకుని కనిపించారు.

ఇదిలా ఉండగా.. వెంకటేష్ - శైలేష్ కొలను కలయికలో రూపొందుతోన్న 'సైంధవ్' మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తున్నారు. అలాగే, ఆండ్రియా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X