SAINDHAV: సంక్రాంతి లెక్క మార్చిన వెంకీ.. సైంధవ్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను అలరించే చిత్రాలను చేస్తూ వెళ్తోన్న హీరో విక్టరీ వెంకటేష్. ఇలా దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఏకధాటిగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాస్త వేగం తగ్గించారు. అయినప్పటికీ గతంలో కంటే సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్‌తో అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వెంకటేష్ 'సైంధవ్' అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అంతేకాదు, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కూడా చిత్రీకరణను బ్రేకులు లేకుండా జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే సగానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది.

దగ్గుబాటి వెంకటేష్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీని 2023, డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, తాజాగా వెంకటేష్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మరో ప్రకటన వెలువడింది. అంతేకాదు, ఈ సారి ఈ మూవీని జనవరి 13న అంటే సంక్రాంతి బరిలో నిలిపినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 'ఈసారి సంక్రాంతి కి లెక్క మారుద్ది' అని పోస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా.. వెంకటేష్ - శైలేష్ కొలను కలయికలో రూపొందుతోన్న 'సైంధవ్' మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తున్నారు. అలాగే, ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











