SAINDHAV Teaser: సైకోలా షాకిచ్చిన వెంకటేష్.. లెక్క మారుద్ది నా కొడకల్లారా!
బడా ప్రొడ్యూసర్ కొడుకుగా సినిమాల్లోకి వచ్చినా.. ఆరంభంలోనే తనదైన మాస్, క్లాస్ యాక్టింగ్‌ను చూపించి స్టార్‌గా ఎదిగిపోయాడు విక్టరీ వెంకటేష్. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. గతంలో మాదిరిగా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడం లేదు. దీంతో ఢీలా పడిపోయిన ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపడం కోసం వెంకీ ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టును చేస్తున్నాడు. అదే సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న 'సైంధవ్' మూవీ. దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయని చెప్పాలి.
హిట్ ఫ్రాంచైజీతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమానే 'సైంధవ్'. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించేశారు. అంతేకాదు, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును సైతం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కూడా చిత్రీకరణను బ్రేకులు లేకుండా జరుపుతున్నారు. ఒకవైపు షూట్ పనులు చేస్తూనే.. మరోవైపు ప్రమోషన్‌ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో రాబోతున్న 'సైంధవ్' మూవీ నుంచి వచ్చిన టీజర్‌లో హీరో తన ఫ్యామిలీతో సంతోషంగా గడిపే సన్నివేశాలను ముందుగా చూపించారు. ఆ తర్వాత మాఫియా వాళ్లు ఓ ప్లాన్ చేయడం.. అది ఫెయిల్ అవడాన్ని హైలైట్ చేశారు. ఆ తర్వాత సైకోగా హీరో ఎంట్రీ ఇవ్వడంతో పాటు శత్రువులను మట్టుబెట్టడం ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంది. ఇక, చివర్లో 'వెళ్లే ముందు చెప్పి వెళ్లా వినలేదు. అంటే భయం లేదు. లెక్క మారుద్దిరా నా కొడకల్లారా' అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.
మొత్తంగా 'సైంధవ్' మూవీ టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్లుగా చెప్పొచ్చు. ముఖ్యంగా వెంకటేష్ లుక్ కూడా ఆయన అభిమానులు కోరుకునే విధంగానే ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఒక్కసారిగా రెట్టింపు అయిపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహంలో లేదు.
ఇక, వెంకటేష్ - శైలేష్ కొలను కలయికలో రూపొందుతోన్న 'సైంధవ్' మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తుండగా.. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











