twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫ్2 సెన్సార్.. కామెడీతో వస్తున్నాం.. వరుణ్ తేజ్!

    |

    విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని దర్శకుడు. వినోదాత్మక చిత్రాలని తెరకెక్కించడంలో అనిల్ రావిపూడిది ప్రత్యేక శైలి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సారి అనిల్ రావిపూడి కామెడీ ప్రధాన అంశంగా ఎఫ్2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఎఫ్2 టీజర్ చూస్తుంటే ఈ సంక్రాంతికి తోడల్లుళ్లుగా వస్తున్న వెంకీ, వరుణ్ తేజ్ చేయబోయే రచ్చ మాములుగా ఉండబోవడంలేదని అర్థం అవుతోంది.

    తాజాగా ఎఫ్2 చిత్రం సెన్సార్ కార్యక్రాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఎఫ్2 చిత్రానికి సెన్సార్ సభ్యులు 'యూఏ' సర్టిఫికెట్ జారీ చేశారు. కావాల్సినంత కామెడీతో వస్తున్నాం సిద్ధంగా ఉండండి అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. జనవరి 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

    Venkatesh, Varun Tej F2 movie censor complete

    సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో విడుదలకు అన్ని పనులు పూర్తయినట్లు అయింది. తమన్నా వెంకటేష్ కు జోడిగా నటిస్తోంది. మెహ్రీన్ వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది. పెళ్లి తర్వాత భార్యల నుంచి ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    English summary
    Venkatesh, Varun Tej F2 movie censor complete.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X