వెంకీ, వరుణ్ రచ్చ మొదలయ్యేది రేపటి నుంచే!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వినోదం పండించడంలో వెంకీ దిట్ట. అలాంటి వెంకీకి వరుణ్ తేజ్ తోడు కాబోతున్నాడు. వీరిద్దరి మధ్య సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సందడి చేస్తారట. ఇలాంటి ఆసక్తికర విశేషాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
ఎఫ్2 చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. బుధవారం నుంచి ఎఫ్2 అప్డేట్స్ అందిస్తాం అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. దీనితో ఎఫ్2 పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతికి బలమైన పోటీ ఉన్నప్పటికీ ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసం మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. వెంకటేష్ మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











