F3 Movie Twitter Review: కామెడీ అదిరింది కానీ మళ్ళీ అనుకున్నట్లే జరిగింది.. F2 బెటర్ అంటూ..
F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ F3 మూవీ నేడు వరల్డ్ వైడ్ గా విడుదల అవుతోంది. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించారు. ఈసారి అంతకుమించి కామెడీ ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేశారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ను ప్రదర్శించగా ఆడియేన్స్ సోషల్ మీడియాలో వారి స్పందనను తెలియజేస్తున్నారు. ఇక ట్విట్టర్ లో ఎలా రియాక్టర్ అయ్యారు అనే వివరాల్లోకి వెళితే..
Recommended Video


నెగిటివ్ టాక్ వచ్చినా..
2019లో వచ్చిన కామెడీ మల్టీస్టారర్ మూవీ F2 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కొంత నెగిటివ్ టాక్ అందుకోవడం విశేషం. ఇక F3 సినిమాపై ఆ ప్రభావం కొంత అయితే ఉంది. కానీ చిత్ర యూనిట్ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అని 90% ఆడియెన్స్ నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

ఇంతలా ఎప్పుడు నవ్వలేదు
సినిమాలో వెంకటేష్ కామెడీ చాలా బాగుందని ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే దర్శకుడు క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన విధానం బావుందని అంటున్నారు. ఇక దర్శకుడి పని తనాన్ని కూడా ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. EVV గారు గోర్తొచ్చారు అంటూ వెంకటేష్ వరుణ్ తేజ్ క్యారెక్టర్స్ హైలెట్ అంటూ రీసెంట్ టైమ్స్ లో ఇంతలా ఎప్పుడు నవ్వలేదు అని చెబుతున్నారు.

ఫస్ట్ హాఫ్ లోనే..
ఫస్ట్ హాఫ్ లోనే లాఫ్ రైడ్ అని 'నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్' అనే ఎపిసోడ్ చాలా నవ్విస్తుందని చెబుతున్నారు. వెంకటేష్ ఈ సినిమాలో రేచీకటి క్యారెక్టర్ లో ఆదరగొట్టేశారు అని అలాగే వరుణ్ తేజ్ నత్థి క్యారెక్టర్ తో కూడా బాగా ఎంటర్టైన్ చేశాడని చెబుతున్నారు.

F3 కంటే F2 బెటర్
ఈ సినిమాకు కేవలం పాజిటివ్ టాక్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ టాక్ కూడా ఎక్కువగానే వస్తోంది. F2 సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ ఓ వర్గం ఆడియెన్స్ ఆ సినిమాను మెచ్చలేదు. కామెడీ రోత ఎక్కువయ్యిందని అన్నారు. ఇక ఇప్పుడు అలాంటి వారు F3 కంటే F2 బెటర్ అని అంటున్నారు.

థియేటర్లు షేక్
ఇక ఈ సినిమాకు రివ్యూలు నెగిటివ్ గా వచ్చినప్పటికీ రెవెన్యు తీసుకు వచ్చే మూవీ అని గతంలో F3 సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినప్పటికీ ఆడియెన్స్ మళ్ళీ మళ్ళీ చూశారని ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కామెడీకి థియేటర్ కూడా షేక్ అవుతుందని అన్నారు.

అలా చూస్తే..
అయితే ఈ సినిమాను కూడా అంచనాలు లేకుండా సినిమాను సినిమాలాగే చూస్తే చాలా బాగా నచ్చుతుందని అని.. నిజంగా మీరు మూవీ లవర్స్ అయితే జానర్స్ ను బట్టి చూసే విధానం ఉంటుంది అని కూడా మరికొందరు అంటున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా సినిమాను చూడగలిగితే హ్యాపీగా నవ్వుకోవచ్చు అని కూడా మరికొందరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











