నవ్వించి చంపేలా ఉన్నారే! ‘ఎఫ్ 2’ ట్రైలర్లో వెంకీ, వరుణ్ కామెడీ కేక!

Recommended Video

F2 Trailer - Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్‌ 2'. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ట్యాగ్‌ లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది.

సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం ఎఫ్ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సారి పండక్కి వెంకీ, వరుణ్ తేజ్ నవ్వించి చంపేస్తారేమో? అనే రేంజిలో ట్రైలర్ ఉండటమే అందుకు కారణం.

వెంకీ డైలాగ్ డెలివరీ కేక...

వెంకీ డైలాగ్ డెలివరీ కేక...

వెంకీ ఈ చిత్రంలో తనదైన శైలిలో డైలాగ్ డెలివరీ చేస్తూ, భిన్నమైన ఎక్స్ ప్రెషన్స్‌తో... ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. "ఆమెను అట్టా ఏడిపించక పోతే కడుపులో ఒక కాయ కాయించొచ్చుకదా" అనే డైలాగ్‌కు వెంకీ కౌంటర్ ఇస్తూ "24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలెక్కడ కాస్తాయి మీ తలకాయ్" అని చెప్పడం ప్రేక్షకులను తెగ నవ్వించింది. ‘‘లేడీస్ చాలా ఈజీగా నమ్మేది చాడీస్'' లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

మీరు మగాళ్లు రా బై...

మీరు మగాళ్లు రా బై...

‘‘ఇంత లత్కోర్ పంచాయితీల కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తున్నారంటే.. అరేయ్ మగాళ్లు.. మీరు మగాళ్లురా బై'' అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగ్ ట్రైలర్లో బాగా హైలెట్ అయింది. ఇటు యూత్‌తో పాటు అటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ఉండబోతోందని స్పష్టం అవుతోంది.

తమన్నా, మెహ్రీన్ గ్లామర్

తమన్నా, మెహ్రీన్ గ్లామర్

అటు వెంకీ, వరుణ్ తేజ్ తమ కామెడీతో నవ్విస్తుంటే... ఇటు తమన్నా, మెహ్రీన్ తమ గ్లామర్‌తో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఇద్దరినీ గ్లామర్ పరంగా ది బెస్ట్ అనేలా ప్రజంట్ చేశారు.

పండక్కి నవ్వించడం ఖాయం

‘ఎఫ్ 2' ట్రైలర్ చూస్తే ఈ పండక్కి మీరు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X