చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కామెడీ సినిమా చేశా: వెంకటేష్

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్‌ 2'. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ట్యాగ్‌ లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ... 'జనవరి 12న ఎఫ్ 2 వస్తోంది. ముందుగా అనిల్ రావిపూడికి థాంక్స్ చెప్పాలి. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'మల్లీశ్వరి' తర్వాత పూర్తి కామెడీ సినిమా చేయలేదు. అలాంటి సినిమా మళ్లీ చేసినందుకు ఆనందంగా ఉంది. సినిమాలో మంచి ఫన్ ఉంటుంది. ఈ పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అవుతుంది.' అన్నారు.

 Venkatesh, Varun Tej Speech at F2 Movie Trailer Launch

వరుణ్ తేజ్ మాట్లాడుతూ... మొదటి నుంచి డిఫరెంట్ జోనర్లో సినిమా చేయాలని ఉండేది. కామెడీ ఏదో ఒక సినిమాలో ట్రై చేద్దామనుకున్నాను. కానీ కెరీర్ మొత్తం మీద ఎంత చేద్దాం అనుకున్నానో అనిల్ ఒకే సినిమాలో చేయించాడు. ఈ క్యారెర్టర్ నాకు రావడం, ఇంత మందితో కలిసి చేయడం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ ఒక పిక్నిక్ లా సాగింది' అని తెలిపారు.

 Venkatesh, Varun Tej Speech at F2 Movie Trailer Launch

వెంకీగారికి థాంక్స్ చెప్పాలి. ఆయన కామెడీ ఇరగదీస్తారని అందరికీ తెలుసు. ఆయన ఫ్రేములో ఉండగా ఆయన ఎక్స్‌ప్రెషన్స్, టైమింగుతో మ్యాచ్ అవుతూ నటించడం ఒక ఛాలెంజ్. నాకు చాలా కంఫర్ట్ క్రియేట్ చేయడం వల్ల ఎంతో కొంత చేయగలిగాను. వెంకీ సర్ లాంటి పర్సన్ ను కలవడం, ఆయనతో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X