వెంకీ, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ ‘ఎఫ్ 2’ జర్నీ... (మేకింగ్ వీడియో)
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది.
సినిమా విడుదల దగ్గరపుడుతున్న వేళ ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఆడియోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా జర్నీ ఆఫ్ 'ఎఫ్ 2' పేరుతో మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే యూనిట్ సభ్యులంతా షూటింగ్ ఎంత ఎంజాయ్ చేస్తూ చేశారో స్పష్టమవుతోంది.
ఇటీవల మీడియాతో వరుణ్ తేజ్ మాట్లాడుతూ కడుపు చెక్కలయ్యే నవ్వులు ఉంటాయని, సీటు కిందపడి నవ్వుకునే రేంజిలో కామెడీ ఉంటుందని చెప్పారు. ట్రైలర్ చూసినా, తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో చూసినా... వరుణ్ తేజ్ చెప్పింది అక్షరాలా నిజం అనే భావన కలుగుతోంది.

ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే పూర్తి స్థాయి మొగుడు పెళ్లాల డ్రామా, ఫన్ ఎలిమెంట్స్ ఉండటం, ఎలాంటి హింస, అసభ్యత లేని క్లీన్ మూవీ కావడంతో ఈ సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఈ చిత్రానికే ఉంటుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











