వాయిస్ ఓవర్‌తో ‘క్రాక్‌’.. రవితేజ్ కోసం వెంకీ

రవితేజ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఓ అంచనా ఉంటుంది. డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్ చిత్రాలు రావడం, వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజను గట్టెక్కించడానికే అన్నట్టుగా అదిరిపోయే కాన్సెప్ట్‌తో క్రాక్‌ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటించబోతోన్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

రీసెంట్‌గా విడుదల చేసిన మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. కోరమీసం పోలీసోడా అంటూ శ్రుతీ హాసన్, రవితేజ కెమిస్ట్రీతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇక ట్రైలర్‌తో మాస్ మహారాజా అభిమానులను కట్టి పడేసేందుకు రెడీ అయ్యారు. న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో అప్డేట్‌ను యూనిట్ ప్రకటించింది.

Venkatesh Voice Over To Ravi teja Krack

ఇక న్యూ ఇయర్ కానుకగా క్రాక్ పుట్టించేలా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 1న క్రాక్ ట్రైలర్ విడుదల కాబోతోంది. అయితే ఈ ట్రైలర్‌కు ఓ స్పెషల్ అట్రాక్షన్‌ను యాడ్ చేశారు. విక్టరీ వెంకటేష్ చేత వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక వెంకీ మామ గొంతులో రవితేజ దూకుడు ఓ రేంజ్‌లో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రవితేజ దుమ్ములేపనున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X