మామాఅల్లుళ్లు చించేశారు.. ఇప్పుడే ఇలా దూకుతున్నారంటే ఇక మున్ముందు!
అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్ళని అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇద్దరూ కలిసి వెండితెర మామా అల్లుళ్లుగా అలరించేందుకు రెడీ అవుతున్నారు. నేటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే బెటర్ ఆప్షన్ వెంకటేష్ అని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. మల్టీస్టారర్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అదే బాటలో వెళ్తూ వెంకీతో పాటు ఓ క్రేజీ స్టార్‌ని చూజ్ చేసుకుంటున్నారు.
ఈ నేపాఢ్యము లోనే డైరెక్టర్ బాబీ వెంకటేష్‌తో పాటు నాగచైతన్యను ఎంచుకొని వెంకీమామ సినిమా రూపొందిస్తున్నాడు. నిజ జీవితంలో మామా అల్లుళ్లు కాస్తా ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు. చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

కాగా తాజాగా దీపావళి కానుకగా వెంకీమామ నుంచి వెంకటేష్, నాగచైతన్య లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మామాఅల్లుళ్ళు ఇద్దరూ యమ సీరియస్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వెంకటేష్ రైతుగా నటిస్తుంటే.. చైతూ ఆర్మీ ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కారెక్టర్స్ హైలైట్ చేస్తూ దీపావళి కానుకగా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం దగ్గుబాటి, అక్కినేని అభిమానుల్లో జోష్ నింపింది. మామాఅల్లుళ్లు చించేశారు.. ఇప్పుడే ఇలా దూకుతున్నారంటే ఇక మున్ముందు మ్యాటర్ మరోలా ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు.


Click it and Unblock the Notifications











