సాంగ్ షూట్‌లో మామ అల్లుడు.. ఇరగదీస్తున్న వెంకీ, చైతూ.. వైరల్ లుక్
రియల్ లైఫ్ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా మారబోతున్న సంగతి తెలిసిందే. వాళ్ల రిలేషన్ ఫోకస్ అయ్యేలా ఈ సినిమాకు 'వెంకీమామ' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ 'వెంకీమామ' పై హైప్ క్రియేట్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నేపధ్యంలోనే తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ పోస్టర్లో వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరూ పంచెకట్టు, మెరూన్ కలర్ షర్టు ధరించి అచ్చమైన తెలుగు మామాఅల్లుళ్లుగా కనిపిస్తున్నారు. సాంగ్ షూట్‌లో భాగంగా సంతలో ఒక బెంచిపై కూర్చున్న ఆ ఇద్దరి ముఖంలో కనిపిస్తున్న నవ్వులు అక్కినేని, దగ్గుబాటి అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. చైతూ అయితే మావయ్య వెంకటేష్ మీద చెయ్యేసి మరీ నవ్వుతున్నాడు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లతో పోలిస్తే ఈ పోస్టర్ మరింత బ్రైట్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

'వెంకీమామ' సినిమాలో ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే కామెడీ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ సినిమాకు డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











