వెంకీమామ రిలీజ్ డేట్ ఫిక్స్.. మొత్తానికి ఇలా డిసైడ్ అయ్యారా?
అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా 'వెంకీమామ'. డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లయిన వెంకటేష్, నాగచైతన్య రిలేషన్ ఫోకస్ అయ్యేలా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.
ఇప్పటికే విడుదలైన వెంకీమామ పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ బాగా ఆకట్టుకోవడంతో విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఉంది ప్రేక్షకలోకం. అయితే తాజాగా వెంకీమామ రిలీజ్ డేట్‌కి సంబంధించిన ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. చిత్రాన్ని డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఎలాగూ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబు, బాలకృష్ణ సినిమాల విడుదల ఉందికాబట్టి ఆ లోగానే మార్కెట్ చేసుకోవాలని ఇలా డిసైడ్ అయ్యారట దర్శకనిర్మాతలు.

వెంకీమామ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుస్తోంది. ఏకంగా 37 నుంచి 40 కోట్ల బిజినెస్ జరగొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











