ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్.. వెంకీమామ హంగామా మామూలుగా లేదండోయ్
మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'వెంకీమామ'. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని డిసెంబర్ 13న విడుదల సిద్దమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా డిసెంబర్ 7న ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో వెంకటేష్ సహా చిత్రయూనిట్ అంతా తెగ హంగామా చేసింది.
ఈ సందర్బంగా వేదికపైకి వచ్చిన వెంకటేష్ తన మాటలతో హూషారెత్తించారు. వెంకీమామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఖమ్మం రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమాలో చైతుకి మాత్రమే వెంకీ మామను.. ఇక నుంచి అందరికీ వెంకీమామను అని చెప్పారు వెంకటేష్. అభిమానుల డిమాండ్ మేరకు ''ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్'' అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. నాకు అండైనా, దండైనా నా ఫ్యాన్సే అన్నారు వెంకటేష్.

తాను ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, నా మేనల్లుడు చైతుతో చేస్తున్న వెంకీ మామ మరొక ఎత్తు అని తెలిపారు వెంకీ. తనతో కలిసి చైతు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి అత్యద్భుతంగా నటించాడని కొనియాడారు. ఈ మూవీ తనకు సినీ జీవితం మొత్తంలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోతుందని అన్నారు. ఇక దర్శకుడు బాబీ ఈ సినిమాను ప్రాణంపెట్టి తెరకెక్కించాడని, తప్పకుండా రిలీజ్ తరువాత సినిమా ప్రేక్షకులను మరియు దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందని వెంకీ చెప్పారు.
కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ' చిత్రానికి దగ్గుబాటి సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 13న వెంకీమామ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











