twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీమామ ట్రైలర్: రొమాన్స్, కామెడీ, డైలాగ్స్‌ అన్నీ హైలైటే.. మామాఅల్లుళ్ళ హంగామా

    |

    రియల్ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు. వారి మధ్య రిలేషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో సినిమా రూపంలో చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో 'వెంకీమామ' సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నారు.

    ఖమ్మంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

    ఖమ్మంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

    ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని డిసెంబర్ 13న విడుదల సిద్దమైన వెంకీమామ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా డిసెంబర్ 7న ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా వెంకీమామ ట్రైలర్ కూడా విడుదల చేశారు.

    ఆకట్టుకున్న ట్రైలర్.. వెంకీమామ రేంజ్

    ఆకట్టుకున్న ట్రైలర్.. వెంకీమామ రేంజ్

    ‘మనిషి తలరాతని రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతని తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకి ఉందని నా నమ్మకం' అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 2 నిమిషాల 10 సెకనుల నిడివితోనే కూడిన ఈ ట్రైలర్ వెంకీమామ సినిమా రేంజ్ ఏంటో తెలిపింది.

    నాగచైతన్య, వెంకటేష్ డైలాగ్స్ హైలైట్

    నాగచైతన్య, వెంకటేష్ డైలాగ్స్ హైలైట్

    ట్రైలర్ లో చూపించిన కామెడీ సీన్స్, ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ అన్నీ ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా సినిమాపై ఉన్న హైప్ రెట్టింపయింది. ‘ఈసారి జాతరను రంగులతో కాదు మీ రక్తంతో ఎరుపెక్కిస్తాను.. రండ్రా నా కొడాకల్లారా..' అనే ఎమోషనల్ డైలాగ్‌తో వెంకటేష్ తన పవర్ చూపించారు. ‘నీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు మామయ్యా.. అది నీ వల్ల కూడా కాదు..' అనే డైలాగ్‌తో సోల్జర్‌గా నాగచైతన్య ఆకట్టుకున్నాడు.

    ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతోంది

    ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతోంది

    హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘వెంకీమామ' సినిమాలో వెంకటేష్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండటం విశేషం. వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య సరసన రాశీఖన్నా రొమాన్స్ అదిరేలా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది. డిసెంబర్ 13 నుంచి ఈ మామాఅల్లుళ్ళ హంగామా మొదలుకానుంది.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review

    వెంకీమామ మూవీ

    కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ' చిత్రానికి దగ్గుబాటి సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి.

    English summary
    Daggubati Venkatesh and Naga Chaitanya playing lead roles in Venky Mama movie. Now this movie trailer released and getting huze responce.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X