యంగ్ హీరోయిన్‌తో రెచ్చిపోయిన వెంకటేష్.. హైపర్ ఆదికి ఆ సీక్రెట్ చెప్పేసిన నాగచైతన్య
రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగచైతన్య ఇద్దరూ కెమెరాకే కిక్కిచ్చేలా సెట్స్‌పై రెచ్చిపోయి పర్ఫార్మ్ చేస్తున్నారు. అల్లుడు రాశిఖన్నాను తగులుకుంటే.. మామ పాయల్ రాజ్‌పుత్ కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో హైపర్ ఆదికి సీక్రెట్‌గా ఓ విషయం చెప్పశాడు నాగచైతన్య. అది కూడా కెమెరా ముందే. దీంతో ఈ క్లిప్పింగ్స్ నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

రియల్ లైఫ్.. రీల్ లైఫ్
రియల్ లైఫ్ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా మారబోతున్న సంగతి తెలిసిందే. వాళ్ల రిలేషన్ ఫోకస్ అయ్యేలా ఈ సినిమాకు ‘వెంకీమామ' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ ‘వెంకీమామ' పై హైప్ క్రియేట్ చేస్తోంది చిత్రయూనిట్.

వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్ రొమాంటిక్ క్లిప్పింగ్స్
ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన లిరికల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్నాళ్ళకో అంటూ సాగిపోతున్న ఈ లిరికల్ వీడియో మొదట హైపర్ ఆది, నాగచైతన్య సీన్ తో మొదలై రక్తి కట్టిస్తోంది. ఈ ముళ్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకొని ఉంటే.. అంటూ నాగచైతన్య, హైపర్ ఆదితో అనడం.. ఆ వెంటనే వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్ రొమాంటిక్ క్లిప్పింగ్స్ రావడం ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చింది.
నెట్టింట వైరల్.. వెంకీమామ స్టామినా
శ్రీ మణి అందించిన లిరిక్స్ పై పృథ్వి చంద్ర ఈ సాంగ్ ఆలపించారు. థమన్ సంగీతం అందించాడు. వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్ రొమాంటిక్ క్లిప్పింగ్స్ చూపిస్తూ ఈ లిరికల్ సాంగ్ కట్ చేశారు. దీంతో ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది. వేగంగా వ్యూస్ రాబడుతూ వెంకీ మామ స్టామినా చెప్పకనే చెబుతోంది.
Recommended Video

ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే విధంగా
ఇకపోతే ‘వెంకీమామ' సినిమాలో ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే కామెడీ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ సినిమాకు డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో
భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











