Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు.. అవే: నాగ చైతన్య కామెంట్స్
వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల సిద్ధమైంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా డిసెంబర్ 7న ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో వెంకటేష్ సహా చిత్రయూనిట్ అంతా తెగ హంగామా చేసింది.
ఈ సందర్బంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. వెంకీమామ సినిమా నాకెంత స్పెషలో మీరంతా నాకు అంతే స్పెషల్. నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు అవే మనం, వెంకీమామ. ఇవి నాకు సినిమాలు కాదు.. మెమరీస్. లైఫ్ లాంగ్ ఇలాగే మెమరీస్ లా గుర్తుంది పోతాయి ఈ సినిమాలు. కెమెరా వెనకాల ఒక మామ, కెమెరా ముందు ఒక మామ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక నాకే క్రెడిట్ వచ్చినా అది ఆ ఇద్దరికే డేడికేట్ చేస్తా అంటూ వెంకటేష్, బాబీలను ఉద్దేశిస్తూ మాట్లాడారు నాగ చైతన్య.
ఒక మిల్ట్రీ ఎపిసోడ్ ఇచ్చి నా కెరీర్ లో ఓ కొత్త దారి తీసుకొచ్చారు బాబీ. చిత్ర యూనిట్ అంతా బాగా సపోర్ట్ చేసింది. పాయల్ తో ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ట్రాక్ సూపర్‌గా ఉంటుందని నాగ చైతన్య అన్నారు. మీరు బాగుంటే మేమంతా బాగుంటాం.. జాగ్రత్తగా ఇంటికెళ్ళండి అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు చైతూ.
కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ' చిత్రానికి దగ్గుబాటి సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎస్ఎస్.థమన్ సంగీతం అందించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 13న వెంకీమామ విడుదల కానుంది.