కమెడియన్లందరూ ఒకే చోట.. వెన్నెల కిషోర్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ కమెడియన్లందరూ ఎంత సఖ్యతగా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, తాగుబోతు రమేష్ ఇలా అందరూ కలిసి ప్రతీ ఏడాది ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటారు. అందరూ కలిసి థీమ్ పార్టీలా గ్రాండ్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ మధ్య ఇలా కమెడియన్లందరూ కలిసి చిన్న పిల్లల్లా మారిపోయారు. స్కూల్ యూనిఫాంలు ధరించి షాకిచ్చారు.
అయితే అప్పుడు చిన్న పిల్లల్లా ఉన్న వారంతా ఇప్పుడు పెద్ద వారిలా మారిపోయారు. పంచెలు కట్టుకుని సోగ్గాడే చిన్ని నాయనా టైపులోకి మారిపోయారు. నిన్న రాత్రి కమెడియన్లందరూ కలిసి రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పార్టీకి సంబంధించి వెన్నెల కిషోర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. తన శైలిలో క్యాప్షన్స్ పెడుతూ అందరినీ నవ్వించేశాడు. సత్యం రాజేష్ ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు వెన్నెల కిషోర్ తన ప్రాసతో అదరగొట్టేశాడు. సత్యం రాజేష్ ఈవెంట్ హోస్ట్, మెను.. ఎవ్రీథింగ్ రోస్ట్, అటెండెన్స్.. ఎవ్రీవన్ ఆల్మోస్ట్, లొకేషన్.. చెవెల్ల చెక్ పోస్ట్, అకేషన్.. జస్ట్ ప్రపోజింగ్ ఏ టోస్ట్ అంటూ కామెంట్ చేశాడు. ఇక ఈ పార్టీలో రోలర్ రఘు, సత్య, వేణు ఇలా అందరూ కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











