ఆ నటుడి వయసుపై అదిరిపోయే కౌంటర్ వేసిన దర్శకుడు, కమెడియన్
టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ.. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. ఎలాంటి పాత్రలోనైనా ఇముడిపోయేలా నటించగల సమర్థుడు. తాజాగా సైరా చిత్రంలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఈయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.
కాలం మారుతున్నా.. బ్రహ్మాజి మాత్రం ఏమీ మారడం లేదంటూ ఆటపట్టిస్తుంటారు తోటీ నటీనటులు. ఇక బ్రహ్మాజీ సీక్రెట్ అంటూ ఆరాలు తీసేవారూ ఉన్నారు. అంతలా బ్రహ్మాజి తన ఫిజిక్‌ను మెయింటెన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా మరోసారి బ్రహ్మీజి ఏజ్‌పై సెటైర్లు పేలుతున్నాయి. దీనంతటికి కారణం తాజాగా బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడమే.
అనిల్ రావిపూడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. మేమిద్దరం ఒకే ఒకప్పుడు క్లాస్‌మేట్స్.. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా సెట్‌లోకలుసుకున్నందుకు హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు బదులిస్తూ.. తన టైమింగ్‌ను మరోసారి నెటిజన్లకు చూపించాడు. అదేంటీ సేవ్ గ్లాస్ అన్నావ్.. మళ్లీ ఇప్పుడు సేమ్ క్లాస్ అంటున్నావ్.. ఎలాగైతేనేం.. మీసినిమాలు చూస్తూ పెరిగామంటూ.. కౌంటర్ వేశాడు.

అయితే బ్రహ్మాజీ ఏజ్ గురించి చెప్పినట్టుగా.. వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. మా నాన్న కూడా నీ సినిమాలు చూస్తూనే పెరిగాడు..నేను కూడా ఇంకా నీ సినిమాలు చూస్తూనే పెరుగుతున్నాను అంటూ బ్రహ్మాజిని ఏడిపించసాగారు. వీరంతా సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో సరదాగా గడిపేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











