twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా క్రైసిస్ ఛారిటీ.. సినీ కార్మికుల కోసం కదిలిన కమెడియన్స్

    |

    మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన మంచి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు అండగ నిలబడేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా తోటీ నటీనటులను కూడా పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చాడు. చిరు పిలుపు మేరకు యంగ్ హీరోలంతా కదిలి వచ్చారు.

    మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శర్వానంద్, కార్తికేయ, విశ్వకేస్‌న్, దిల్ రాజు లాంటి వారంతా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కింగ్ నాగార్జున కోటి రూపాయలు, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ చారిటీ మెంబర్స్‌ను కూడా ప్రకటించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సంప్రదించడండని చిరంజీవి ట్వీట్ చేశాడు.

    Vennela Kishore And Sampoornesh babu Donates To Corona Crisis Charity

    తాజాగా ఈ ఛారిటీకి వెన్నెల కిషోర్, సంపూర్ణేష్ బాబు విరాళాన్ని ప్రకటించారు. వెన్నెల కిషోర్ రెండు లక్షలు, సంపూర్ణేష్ బాబు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. షూటింగ్‌లు లేక, పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న రోజువారీ సినీ కార్మికులకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.

    English summary
    Vennela Kishore And Sampoornesh babu Donates To Corona Crisis Charity. Sampoornesh babu donates an amount of Rs. 1 lakh to CoronaCrisisCharity (CCC) Fund setup by the Telugu Film Industry
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X