Chaari 111: వెన్నెల కిషోర్ "చారి 111"పై సెన్సార్ రియాక్షన్.. రన్ టైమ్ ఎంతంటే?
టాలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో చారి 111 అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా సెన్సార్ షిప్ పూర్తి చేసుకుంది. అయితే వెన్నెల కిషోర్ చారి 111 సినిమాలు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, రన్ టైమ్ ను ఎంతకు ఫిక్స్ చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్నెల కిషోర్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో సుంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా చేస్తోంది. బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టీజర్, ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి.

ఈ సినిమాకు ఎడిటర్ గా రిచర్డ్ కెవిన్ ఎ వ్యవహరిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా కషిన్ గ్రోవర్ బాధ్యతలు నిర్వహించారు. అలాగే సైమన్ కె కింగ్ సంగీతం అందించగా.. అక్షత బీ హొసూరు ప్రొడక్షన్ డిజైనర్ పనులు చూసుకున్నారు. అలాగే సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్తిర సాహిత్యం అందించారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేషాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ షిప్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రియాక్షన్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చారి 111 సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ను అందించింది. అలాగే రన్ టైమ్ ను 2.30 గంటలుగా ఫిక్స్ చేసింది. అంటే మొత్తం 150 నిమిషాలు పాటు వెన్నెల కిషోర్ చారి 111 సినిమా ఉంటుంది. యాక్షన్ తో పాటు అద్భుతమైన కామెడీని అందించేందుకు రాబోతున్న ఈ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాను మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











