నా బతుక్కి అదొక్కటే తక్కువైంది.. వెన్నెల కిషోర్ ట్వీట్ వైరల్
వెన్నెల కిషోర్ పంచ్‌లు, సెటైర్లు, కామెడీ టైమింగ్‌ను వెండితెరపై ఎంజాయ్ చేస్తుంటాం. అయితే అంతకు మించిన ఎంటర్టైన్మెంట్‌ను సోషల్ మీడియాలో పంచుతుంటాడు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ చేసే ట్వీట్లు, వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక వెన్నెల కిషోర్‌తో బ్రహ్మాజి, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి వంటి వారు తోడైతే ఇక అది మరో లెవెల్‌లో ఉంటుంది. వీరంతా కలిసి ట్విట్టర్‌లొ వాట్సప్ చాట్ చేసినట్టుగా వరుస కౌంటర్లు వేసుకుంటారు.
తాజాగా వెన్నెల కిషోర్ ఇచ్చిన రిప్లై తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలు, హీరోయిన్ల బర్త్ డేలు ఎలా ట్రెండ్ అవుతున్నాయ్.. వారి ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో హంగామా చేస్తున్నారో తెలిసింది. ఏకంగా వరల్డ్ రికార్లలు కొట్టేస్తూ తమ హీరోల సత్తా చాటుతున్నారు. బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌లు, అడ్వాన్స్ విషెస్, కామన్ డీపీలతో నానా రచ్చ చేస్తున్నారు. అయితే ఇదే విషయంలో వెన్నెల కిషోర్ ఓ సెటైర్ వేశాడు.

వెన్నెల కిషోర్ బర్త్ డే కామన్ డీపీ చేస్తున్న ఫ్యాన్స్ క్లబ్ రియాక్ట్ అవ్వండి అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ఇక ఫ్యాన్ ట్వీట్‌పై వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. నా బతుక్కి కామన్ డీపీ ఒకటి తక్కువైంది. ఉన్న కాస్తో కూస్తో ఇజ్జత్ కూడా పోద్ది.. వద్దన్నో అంటూ ఫన్నీ ట్వీటేశాడు. మరి నిజంగానే వెన్నెల కిషోర్ బర్త్ డే(సెప్టెంబర్ 19)కు హంగామా చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారా అన్నది చూడాలి.



Click it and Unblock the Notifications











