దమ్ముంటే కాస్కో, దుమ్ముంటే ఊడ్స్కో.. నవ్వులు పూయిస్తున్న కమెడియన్
కరోనా ధాటికి జనమంతా ఇంటికి పరిమితమయ్యారు. దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో అంతా మూగబోయింది. సామాన్యజనం నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇంట్లోనే ఉండండి, అదే లక్ష్మణ రేఖ దాటి రావొద్దని ప్రధాని సూచించడం, మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో సెలెబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమై.. పనులు చేసుకుంటున్నారు. కొందరు ఇంట్లోనే వర్కౌట్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. సెలెబ్రిటీలు ఇంటి పట్టున ఉంటూ వారేం చేస్తున్నారో సోషల్ మీడియా ద్వారా చెబుతూ ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని సలహా ఇస్తున్నారు.

ఈ క్రమంలో వెన్నెల కిషోర్ షేర్ చేసిన వీడియో, కామెంట్ తెగ వైరల్ అవుతోంది. దమ్ముంటే కాస్కో.. దుమ్ముంటే ఊడ్స్కో అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇళ్లంతా ఊడ్చుకుంటూ ఉన్న వీడియోను షేర్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











