Don't Miss!
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కోపంతో రగిలిపోతున్న రవితేజ.. వెన్నెల కిషోర్ రియాక్షన్ చూడండి
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే కమెడియన్ ఎవరంటే ఠకీమని గుర్తొచ్చే పేరు వెన్నెల కిషోర్. ఆన్లైన్ వేదికపై ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండే ఈ కమెడియన్ ఏదో ఒక పోస్ట్ ద్వారా నవ్విస్తూనే ఉంటాడు. తన సినిమాలకు సంబంధించి హింట్స్ ఇస్తూ సూపర్ ప్రమోషన్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'డిస్కో రాజా' సినిమా నుంచి ఓ లుక్ పోస్ట్ చేశాడు.
డిస్కోరాజా షూటింగ్లో పాల్గొంటూ రవితేజతో ఓ ఫోటో దిగిన వెన్నెల కిషోర్ దానిని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. క్యూరియస్తో ఫ్యూరియస్.. డిస్కోరాజా.. ఎందుకంత కోపం అని ట్వీట్ చేశాడు. ఈ పిక్‌లో రవితేజ కోపంతో రగిలిపోతున్నట్లుగా కనిపిస్తుండగా, వెన్నెల కిషోర్ అతన్ని ఆసక్తిగా చూస్తూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.
వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా తెరకెక్కుతోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
Curious with the Furious#DiscoRaja#WhySoSerious 😆 pic.twitter.com/9fqJckB2RV
— vennela kishore (@vennelakishore) September 9, 2019