ఆ ముగ్గురు సూపర్ స్టార్స్‌కు ప్రాణగండం.. వేణుస్వామి సంచలన జోస్యం
తెలుగునాట సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణుస్వామి. ఆయన చెప్పిన జోస్యాలు నిజం కావడంతో వేణుస్వామి ఇంటి ముందు స్టార్స్ క్యూకట్టారు. జ్యోతిష్యంతో పాటు తాంత్రిక పూజలతోనూ ఆయన ఫేమస్ అయ్యారు. వేణుస్వామితో పూజలు చేయించుకున్న వారు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్లడంతో ఆయన పేరు మారుమోగింది. ఇదే సమయంలో కొన్ని జోస్యాలు ఫలించకపోవడం, వివాదాలు చుట్టుముట్టడంతో సినీ ప్రముఖుల జాతక విశ్లేషణలు చేయనని ప్రకటించారు. తాజాగా తన ఫేస్‌బుక్ పేజ్‌లో వేణుస్వామి మాట్లాడుతూ.. పలువురు సూపర్‌స్టార్స్ వ్యక్తిగత జాతకాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
చాలాకాలం తర్వాత ముఖ్యమైన జోస్యాలు ఇవ్వాలని అనుకుంటున్నాను. చాలా సంచలనాలు, ఉపయోగకరమైన ప్రిడిక్షన్స్, రెమెడీస్ చెప్పాలని అనుకుంటున్నాను. దీనికి కారణం.. మాకు బుద్ధి పుట్టినప్పటి నుంచి గురువు అతిచారంలోకి వెళ్లడం ఒక రాశి అని తెలుసు కానీ.. గురువు మూడు రాశుల్లో అతిచారం చేయడం. అతి చారం అంటే అతి చరం. అంటే ఎక్కువగా ప్రయాణించడాన్ని అతిచారం అంటారు. చాలా దేశాలతో పాటు మనదేశంలోనూ చంద్రుడికి సంబంధించి సవ్య అపసవ్య.. సూర్యుడికి సంబంధించి రాసేటువంటి పండితులు ఉన్నారు. చాలా వరకు భారతదేశంలో బృహాస్పత్య మానాన్ని బేస్ చేసుకుని.. అంటే గురువుని బేస్ చేసుకుని జాతకాలు చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను కూడా ఒకరిని.

గురువుని బేస్ చేసుకుని కూడా జాతకాలు చెప్పొచ్చు. జూన్ 2, 2026వ తేదీ నాడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం గురువు.. మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశం... తదుపరి 2027 జనవరి 27 నాడు మళ్లీ కర్కాటక రాశిలకి తిరిగి ప్రవేశం. అంటే ఈ సంవత్సరం మూడు రాశులలో గురువు ప్రభావం ఉండబోతోంది. దీనిని గురువు అతిచారం అంటారు. గురువు అతిచారం వల్ల సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు విపరీతమైన ప్రభావం, విపరీతమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు అన్ని రాశుల మీద తన ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి. ఈ ప్రభావం వల్ల కొంచెం మంచిగానూ, చెడుగానూ ఉంటుంది. బంగారం ధరం 2027 మే లోపు 2 లక్షల 15 వేలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030 చివరి నాటికి బంగారం ధర 5 లక్షల రూపాయలు పలికే అవకాశం ఉంది. బంగారం, వెండిపై ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు లభిస్తాయి.
అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు బయటికి వచ్చేస్తాయి. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా రోడ్ల మీద ప్రదర్శనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్ర మహర్దశలో ఉన్న ట్రంప్‌కి పరాభవం తప్పదు. వచ్చే 6 నెలల పాటు విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే 2027 ఎండింగ్ లోపు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ ఈ ముగ్గురికి ఆరోగ్య పరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి.
అలాగే మమతా బెనర్జీకి సంబంధించి జైలు జీవితం గానీ, ప్రాణగండం గానీ ఖచ్చితంగా కనిపిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో 2027కి ముందు గానీ, వెనుక గానీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉంది. అన్నింటి కంటే సంతోషకరమైన వార్త.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత వశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్, చైనాలు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి మరణం వల్ల ప్రజలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications


