Venu Swamy: హీరో విజయ్ గురించి ముందే చెప్పానన్న వేణుస్వామి.. వీడియో కూడా పెట్టాడుగా!
కోలీవుడ్ దళపతి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత మూడు దశాబ్ధాలుగా కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్, వర్డల్ వైడ్ మార్కెట్ కలిగిన నటుడిగా విజయ్ నిలిచారు. కోట్లాది మంది అభిమాన గణం ఉన్న విజయ్ వ్యక్తిగత జీవితంలో షాక్ తగిలింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య సంగీత సొర్నలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలోకి జ్యోతిష్యుడు వేణుస్వామి ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
హీరో దళపతి విజయ్-సంగీత వివాహం 1999 ఆగస్టు 25న జరిగింది. ఈ జంటకు జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ కుటుంబ జీవితం సాఫీగా కొనసాగినట్లు అభిమానులు భావిస్తారు. అయితే గత రెండేళ్లుగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ భార్య సంగీత.. సొర్నలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

విడాకుల పిటిషన్‌లో ఏముంది?
సంగీత దాఖలు చేసిన 12 పేజీల పిటిషన్‌లో ప్రత్యేక వివాహ చట్టం సెక్షన్ 27(1)(a), 27(1)(d) కింద విడాకులు కోరినట్లు సమాచారం. ఇవి ప్రధానంగా వివాహేతర సంబంధం, మానసిక/శారీరక క్రూరత్వానికి సంబంధించిన నిబంధనలు. తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని ఆమె ఆరోపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై విజయ్ తరఫున ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ కేసు మార్చి 20న చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. విచారణను ఇన్-కెమెరా పద్ధతిలో నిర్వహించాలని సంగీత కోర్టును కోరినట్లు సమాచారం.
వేణుస్వామి ఎంట్రీ - పాత వీడియో వైరల్
ఇలాంటి సమయంలో వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. 2025 అక్టోబర్‌లో తాను ఇచ్చిన ఒక ప్రిడిక్షన్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వేణు స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ..'సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం జరగబోతోంది. చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఓ సూపర్ స్టార్ హీరో విడాకుల సమస్య ఎదుర్కొంటారు. ఓ స్టార్ హీరోయిన్‌తో ఉన్న సంబంధం బయటపడుతుంది. దీంతో ఆ హీరో భార్యకు విడాకులిచ్చి, ఆ హీరోయిన్‌ను పెళ్లాడతాడు' అని జ్యోతిష్యం చెప్పారు.ఈ వీడియోను షేర్ చేస్తూ.. తాను ముందే చెప్పానని పేర్కొన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. అందులో హీరో పేరుగానీ, హీరోయిన్ పేరుగాని ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ, తాను చెప్పిన జ్యోతిష్యం నిజమైనట్టు వేణుస్వామి ప్రకటించుకున్నారు. గతంలో సమంత- నాగచైతన్య విడాకుల విషయంలో చేసిన వ్యాఖ్యలతో వేణుస్వామి పాపులర్ అయ్యారు. కొన్నిసార్లు ఆయన చెప్పిన జోస్యాలు ఫలించగా, మరికొన్ని సందర్భాల్లో విఫలమయ్యాయి. ట్రోలింగ్‌కు గురై కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ కావడం గమనార్హం.
దళపతి విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో విడాకుల వివాదం ఎదురవ్వడం కీలక అంశంగా మారింది. దీనిని ప్రత్యర్థులు రాజకీయంగా వినియోగించుకుంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలకు లోనుకాకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం, వేణుస్వామి పాత వీడియో షేర్ చేయడం ఈ రెండు విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కోర్టు విచారణ తర్వాతే అసలు వాస్తవం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఇది ఊహాగానాలు వస్తునే ఉంటాయి.


Click it and Unblock the Notifications











