కాల్ గర్ల్‌ను కూడా దేవతలా భావిస్తా.. నటి ప్రగతి కామెంట్స్‌కు వేణుస్వామి క్లారిటీ!
సినీనటిగా గుర్తింపు తెచ్చుకున్న పగతి ఆ తర్వాత వెయిట్ లిఫ్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ, పురుషులు సైతం ఆలోచించే వెయిట్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. ఈ క్రమంలోనే ఇటీవల టర్కీలో జరిగిన ఓ టోర్నీలో ప్రతిభ కనబరిచి దేశానికి పతకాలు సాధించారు. ఈ వయసులో ఒక మహిళ అయ్యుండి ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది. సినీ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఆమెను ప్రశంసిస్తున్నారు.
ఇంతలో ఈ వ్యవహారంలోకి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి లైన్‌లోకి వచ్చారు. ప్రగతి సాధించిన ఈ విజయాల వెనుక తన పూజలు ఉన్నాయని ఆయన ప్రగతి పూజలో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రగతి కూడా స్పందించారు. వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్న మాట వాస్తవమేనని, కానీ తన జీవితంలో క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు స్నేహితుల సూచనతనే వేణుస్వామి దగ్గరకి వెళ్లానని ప్రగతి వివరణ ఇచ్చారు.

అయితే ఆ పూజల వల్ల తన జీవితంలో కానీ, వెయిట్ లిఫ్టింగ్ జర్నీలో కానీ ఎలాంటి ప్రభావం చూపించలేదని.. అలాంటిది గతంలో ఎప్పుడో జరిగిన ఫోటోలు, వీడియోలను బయటపెట్టడం సరికాదని ప్రగతి తెలిపారు. రాత్రింబవళ్లు తను పడ్డ కష్టం, నిరంతర సాధన ద్వారా మాత్రమే ఇది సాధించానని చెప్పారు. తన విజయం తాలూకా క్రెడిట్‌ని ఇతరులు తమ ఖాతాలలో వేసుకోవడం వారి సంస్కారానికే వదిలేస్తున్నానని ప్రగతి పేర్కొన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి కామెంట్స్‌పై వేణుస్వామి స్పందించారు.
నా వల్ల ప్రగతి గారు గెలిచారని చెప్పుకునే నీచుడిని నేను కాదు. ఒక అమ్మాయి కష్టపడింది అంటే వందకి వెయ్యి శాతం ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను. ఆ క్రెడిట్ నాకు కావాలని ఎవరైనా అనుకుంటే వాళ్లంత దరిద్రులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని కాను. ఒక కాల్ గర్ల్‌ని కూడా అమ్మవారిగా భావిస్తా. ప్రగతి గారు ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్న మెడల్స్‌తో నాకేం సంబంధం. నేను భగవంతుడికి, ఆమెకు మధ్యలో.. భగవంతుడి అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా స్పోర్ట్స్‌లో ఎంట్రీ చేసేటప్పుడు పూజ చేశా. ప్రగతిగారు నా వల్ల మెడల్ కొట్టారని నేను చెప్పానా? అసలు మాట్లాడేవారికి సిగ్గుశరం ఉందా అని వేణుస్వామి ఫైర్ అయ్యారు.
నా దగ్గర లక్షలాది మంది పూజలు చేయించుకుంటారు.. హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోను బయటపెట్టా. దేవుడిని నమ్మితే లైఫ్‌లో సక్సెస్ ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. ప్రగతి గారు నా వల్ల మెడల్స్ కొట్టలేదు.. వెంకటేశ్వరస్వామి వారి అనుగ్రహం వల్ల, భగళాముఖి అమ్మవారి వల్ల, నేను చేసిన తారా పూజల వల్ల ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టింది, వేణుస్వామికి ఇందులో సింగిల్ పైసా వాటా లేదు. ప్రగతి గారు హార్డ్ వర్కర్, చాలా కష్టపడ్డారు.. మెడల్స్ అందుకోవడానికి ఆమె అర్హురాలు అని వేణుస్వామి వ్యాఖ్యానించారు.
ప్రగతిగారే కాదు.. ఎవరు గెలిచినా వేణుస్వామికి సంబంధం లేదు. పూజలు చేసినందుకు రూపాయో, అర్ధరూపాయో ప్రతిఫలంగా తీసుకుంటా.. కొంతమంది దగ్గర అసలు తీసుకోను. అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను.. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇండస్ట్రీలో పనిచేసేవాళ్లలో 100 మందికి పూజలు చేస్తే నేను ఇద్దరి దగ్గరో ముగ్గురి దగ్గరో ఫీజు తీసుకున్నాను. అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది. ప్రగతిగారు నా దగ్గరికి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో తోపు. నేను స్పోర్ట్స్‌లోకి వెళ్తున్నా.. నా కోసం ఒక మంచి పూజ చేయించమంటే చేయించడం జరిగింది. దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది అని వేణుస్వామి ప్రశ్నించారు.
నా గురించి ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానెల్ ఈ విషయంపై 15 నిమిషాలు ప్రోగ్రామ్ చేసింది. వేణుస్వామిని అడ్డుకోవాలనే ఉద్దేశం ఇది. కానీ వేణుస్వామిని ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్‌స్టార్‌ని చేస్తూనే ఉంది. నేను వద్దు వద్దు అంటున్నాను.. కానీ అదే చేయండి. ప్రగతిగారు నా వల్లే గెలిచారని థంబ్‌నైల్ చేసి పెట్టారు. నిజంగా నాకు ఆ అవసరం ఎందుకుంటుంది? నాకు కూడా సిగ్గుశరం, చీము, నెత్తురు ఉన్నాయి.. ఆడపిల్లకు మూడు రోజులు ఇబ్బంది వస్తే అర్ధం చేసుకునే మగాడిని నేను, మీలాగా కాదు. ఒక అమ్మాయి కష్టపడి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించింది అంటే వెంకటేశ్వరస్వామి అనుగ్రహం అనుకుంటా తప్పా నేను వ్యక్తిగతంగా ఆమె క్రెడిట్‌ను కొట్టేసే మనిషిని కాదు. డబ్బులు లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకుని అడుక్కుంటా కానీ ఆమె క్రెడిట్ లాక్కునేంత దరిద్రుడిని కాదు అని వేణుస్వామి సీరియస్ అయ్యారు.


Click it and Unblock the Notifications











