Venu Swamy: అప్పటి వరకు కష్టమే..! అల్లు అర్జున్ జాతకంపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ .. అలానా
Venu Swamy-Allu Arjun:సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి టాలీవుడ్ అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ సినీ ప్రముఖులు.. ఆర్థిక సహాయం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ జాతకం పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతరం వేణు స్వామి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. తన తండ్రి చేతివేస్తే స్పందిస్తున్నాడు. ఆ పిల్లవాడు కంటి వెంట నీరు రావడం నేను చూశాను. ప్రస్తుతం వెంటిలేటర్, ఆక్సిజన్ సహాయం లేకుండా నార్మల్గానే చికిత్స తీసుకుంటున్నాడని, కచ్చితంగా త్వరలో శ్రీ తేజ్ కోరుకుంటాడని ఆశిస్తున్నాను అని తెలిపారు. బాబు కోసం ఈ వారంలో తాను మృత్యుంజయ యజ్ఞాన్ని తన సొంత డబ్బులతో నిర్వహించబోతున్నానని వేణు స్వామి ప్రకటించాడు.

బాధిత కుటుంబానికి సినీ పరిశ్రమ అండగా నిలుస్తుందని, తాను ఆ చిన్నారికి రెండు లక్షల రూపాయలను అందజేశానని వేణు స్వామి తెలిపారు. తాను కూడా వెయ్యికిపైగా సినిమాలకు ముహూర్తం చేసిన పురోహితుడిగా, పూజారిగా .. సినిమా సొమ్మును తిన్న వ్యక్తిగా.. 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం చేస్తున్నాను' అని వేణు స్వామి తెలిపారు.
ఈ సమయంలో అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ జాతకంపై శని ప్రభావం ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అతని జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాగోలేదని, కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒకరి జీవితంలో ఇలాంటి కష్టాలు చోటు చేసుకుంటాయని, వాటిని తట్టుకొని ముందుకు సాగిపోవడమే అంటూ చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ జాతకం పై షష్ట గ్రహ కూటమి ప్రభావం ఉందని, దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు అనేది? తరువాత ఎలా ప్రవర్తిస్తారు? అనేది ఆధారపడి ఉంటుందని వేణు స్వామి తెలిపారు. ఇలాంటి పరిణామాలు మనం మారడానికి, మన తప్పులను గ్రహించి ఎదగడానికి సహాయపడతాయి. అని వేణు స్వామి అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా సంధ్య థియేటర్ ఘటనలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీతేజ్‌ను చూడాలని అందరికీ ఆత్రుతగా ఉందని, కానీ, పరిధుల వల్ల కుదరడం లేదన్నారు. తమ కొరియోగ్రాఫర్స్ సొసైటీ తరఫున శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.


Click it and Unblock the Notifications











