రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల కెరీర్, వివాహాలు, వ్యక్తిగత జీవితం, రాజకీయ నాయకుల భవిష్యత్తుపై ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆయన జోస్యాలకు మద్దతు తెలిపేవారు ఉన్నట్లే, విమర్శించే వారూ ఉండటంతో వేణు స్వామి పేరు ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్స్‌ పై ఆసక్తికర జోస్యం చెప్పారు. ఇంతకీ ఏమన్నారంటే?

గత కొన్నేళ్లుగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌పై వేణు స్వామి చేసిన జ్యోతిష్య అంచనాలు తరచూ చర్చనీయాంశంగా మారాయి. కొన్నిసార్లు ఆయన చెప్పిన విషయాలు నిజమయ్యాయని అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేయగా, మరికొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కూడా గురయ్యాయి.

Venu Swamy s Predictions on Tollywood Stars

సమంత వ్యక్తిగత జీవితం, ప్రభాస్ సినీ కెరీర్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. అలాగే నాగచైతన్య-శోభిత వివాహం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న ఆయన, కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్నారు.

తాజా వేణ స్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సమయంలో పలువురు టాలీవుడ్ స్టార్స్ పై జ్యోసం చెప్పారు. వేణు స్వామి ఒక్కోక్క స్టార్ పై ఒక్కో పదంతో అభివర్ణిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముందుగా విజయ్ దేవరకొండను "కష్టపడే వ్యక్తి" అని పేర్కొన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను "కారణ జన్ముడు"గా అభివర్ణించారు. స్టార్ హీరోయిన్ సమంతను "ఫైటర్" అని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని "కష్టంతో పైకి వచ్చిన కారణ జన్ముడు"గా కొనియాడారు. సీనియర్ ఎన్టీఆర్‌ను "యుగ పురుషుడు"గా పేర్కొంటూ, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ను "వంశాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి"గా ప్రశంసించారు.

ఇక దర్శకధీరుడు రాజమౌళిని "కారణ జన్ముడు"గా అభివర్ణించగా, మహేష్ బాబును "అందగాడు" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ మఖ నక్షత్రంలో జన్మించారని, ఆ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి అవుతారంటూ వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే నక్షత్రంలో జన్మించారని అన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను "పర్‌ఫెక్ట్ పొలిటీషియన్"గా అభివర్ణిస్తూ ఆయన రాజకీయ నాయకత్వాన్ని ప్రశంసించారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ స్వభావం రాజకీయాలకు పూర్తిగా సరిపోదని వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది ఆయన వ్యాఖ్యలు సపోర్టు చేస్తుంటే. మరికొందరూ తన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X