రవితేజ సినిమాలో ఒకప్పటి టాలీవుడ్ హీరో: రామారావు కోసం డ్యూటీలోకి

ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' వంటి భారీ హిట్‌ను అందుకుని మళ్లీ ట్రాకులోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత అతడు నటిస్తోన్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ కూడా జరిగిపోయింది. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే ప్రకటన వెలువడింది.

రవితేజ హీరోగా శరత్ మందవ తెరకెక్కిస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అతడికి స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను వదిలారు. గతంలో వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అతడు.. చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక, ఇందులో అతడి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.

Venu Thottempudi Key Role in Ravi Tejas Ramarao On Duty

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాస్ మహారాజా రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X