దర్శకుడు వేణు ఊడుగులకు అరుదైన గౌరవం.. మరోసారి నీది నాది ఒకే కథకు ప్రశంస!
2018లో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న చిత్రాల్లో నీది నాదీ ఒకే కథ ఒకటి. యువ దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిభకు ఈ చిత్రం అద్ధం పట్టింది. చిన్న చిత్రంగా రిలీజైన నీది నాది ఒకే కథకు ప్రేక్షకులు నీరాజనం పట్టడంతో భారీ విజయం సాధించింది. తమిళంలో కూడా డబ్బింగ్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి ఎన్నో ఘనతను సొంతం చేసుకొన్న చిత్రం తాజాగా మరోసారి వార్తల్ల నిలిచింది.
నీది నాది ఒకే కథ చిత్రానికి జీ టెలివిజన్ సంస్థ క్రిటిక్స్ అవార్డుతో సత్కరించింది. దర్శకుడు వేణు ఊడుగులకు బెస్ట్ అప్రిసియేషన్ డైరెక్టర్ అవార్డు, ఈ చిత్రంలో హీరోగా నటించిన శ్రీ విష్ణుకు బెస్ట్ అప్రిసియేషన్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని తెలుగు ఫిల్మీబీట్‌తో పంచుకొన్నారు.

నా మొదటి చిత్రం సినీ, విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులను, రివార్డులను గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం, అవార్డులు నాపై అదనపు బాధ్యతను పెట్టాయి అని వేణు ఊడుగుల అన్నారు.
నీది నాది ఒకే కథ చిత్రం తర్వాత ప్రస్తుతం దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా విరాటపర్వం అనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నది.


Click it and Unblock the Notifications











