యువ దర్శకుడు వేణు ఊడుగులకు దాసరి అవార్డు
స్వర్గీయ దాసరి నారాయణరావు అవార్డుల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లు, దవళసత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమొరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా.రఘునాథ్‌బాబు అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు.

గతేడాది నీది నాది ఒకే కథతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ దర్శకుడికి దాసరి స్మారక అవార్డు దక్కింది. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా ఈ అవార్డును అందజేశారు. వేణు ఊడుగులను మాజీ సీఎం రోశయ్య శాలువ, మెమొంటోతో సత్కరించారు. ఈ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ, వీకే నరేష్ తదితరులు పాలుపంచుకొన్నారు. యువ దర్శకుడు వేణు ఊడుగులకు మరో అరుదైన గౌరవం దక్కడంపై పలువురు ఆయనను అభినందించారు. నీది నాదీ ఒకే కథ చిత్రం తర్వాత సాయిపల్లవి, రానాతో విరాటపర్వం అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











