Venuswamy: నటి ప్రగతిపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. అంతా నా వల్లనే ఆమెకు అలా..
Venuswamy: సెలబ్రిటీల జాతకాలు,పూజలు, సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. గత కొంతకాలంగా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సినీ హీరోలు, హీరోయిన్లతో కలిసి పూజలు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వేణు స్వామి ఒక్కసారిగా సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా మారిపోయారు. ఆయనతో పూజలు చేయించుకున్న కొంతమంది సెలబ్రిటీలు స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారని ప్రచారం కూడా ఉంది. ఇలా నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచే జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా నటి ప్రగతిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?
సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెలబ్రెటీల జాతకం చెప్పి పాపులారిటీ సొంతం చేసుకున్న ఆయనను విమర్శలు కూడా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం, విడాకులు, విభేదాలపై జోస్యం చెప్పడం వల్ల చేసుకోవడం వల్ల కాంట్రవర్సీలుగా మారుతాయి. ముఖ్యంగా నాగచైతన్య,శోభిత, సమంత వ్యక్తిగత విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో, ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనని వేణు స్వామి ఓ దశలో ప్రకటన చేశారు కూడా.

అయినా.. వేణు స్వామి పేరు మాత్రం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. పలు యూట్యూబ్ ఛానల్స్‌కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, తనకు వచ్చిన అనుభవాలు, సెలబ్రిటీలతో చేసిన పూజల గురించి మాట్లాడుతూ మరింత సంచలనం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటి ప్రగతి పై చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ప్రగతి మెడల్ సాధించడంపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ 'ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే విమర్శలు రావడం సహజం. ఏ రంగంలోనైనా ఎదుటివారికి టార్గెట్ చేయడానికి వంద మంది 200 చేతులతో రెడీగా ఉంటారు. నువ్వు వాళ్ల నుండి తప్పించుకోవాలంటే.. నువ్వు చాలా తెలివితో చాకచక్యంతో వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒకచోట ఎదురు దెబ్బలు తినాల్సిందే. అవమానాలను దెబ్బలను తప్పించుకోవడానికి నేను ప్రయత్నిస్తా అంతే..' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఇంటర్వ్యూ ప్రారంభించారు.
'చాలామంది సెలబ్రిటీ స్టేటస్ కావాలనీ, సినిమా అవకాశాలు రావాలని చాలామంది భావిస్తుంటారు. నిజంగానే మీరు చెప్పినట్టు నిజ జీవితంలో పేరు ప్రఖ్యాతలు రావాలంటే పూజల వల్ల సాధ్యమా?' అని యాంకర్ ప్రశ్నించగా.. 'ఇటీవల ప్రగతి అనే నటి నా దగ్గరికి వచ్చింది. ఆమె మీ అందరికీ తెలిసిందే. ఆ నటి నా దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంది. ఆమె సినిమాల కోసం నా దగ్గర రాలేదు. గురువుగారు నేను రెజ్లింగ్ లో గెలవాలని కోరుకుంటున్నాను. అని నా దగ్గరికి వచ్చింది. రెజ్లింగ్ గెలవాలని ఆమె ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ పూజల ఫలితమే ఈరోజు మెడల్స్ సాధించింది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇప్పటికే ప్రగతి వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి స్పోర్ట్స్‌లో సాధించిన విజయాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో, తన పూజల ఫలితంగా వేణు స్వామి పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు ఆయన వ్యాఖ్యలను నమ్ముతుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం ప్రచార కోసమేనని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ వైరల్ అవుతున్నాయి.
ఇదే ఇంటర్వ్యూలో "ఒక్క పూజకి లక్షల్లో తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా?" అని యాంకర్ ప్రశ్నించగా, వేణు స్వామి వెటకారంగా స్పందించారు. "అన్ని లక్షలు నాకిస్తే ఇంకేమీ నేను ఎన్నో చేసే వాడిని కదా. అలా పూజలు చేయించుకునే వాళ్లు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే, నిజంగా పూజకి ఎంత తీసుకుంటారన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.ఏది ఏమైనా ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నటి ప్రగతి ఎలా స్పందించారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











