twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ గాయకుడు ఇకలేరు.. గుండెపోటుతో కన్నుమూత!

    |

    ప్రముఖ గాయకుడు మహ్మద్ అజిజ్ ఇకలేరు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో మంగళవారం మరణించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. హిందీ, బెంగాలీ, ఒడియా భాషల్లో సుమారు 2000 పాటలకుపైగా పాడారు.

    ప్రముఖ గాయకుడు, మహ్మద్ రఫీకి అభిమాని అయిన అజిజ్ బాల్యంలోనే గాయకుడిగా కెరీర్ ప్రారంభించాడు. బెంగాలీ చిత్రం జ్యోతితో కెరీర్ మొదలుపెట్టిన తర్వాత ముంబైకి మకాం మార్చారు.

    అమితాబ్ బచ్చన్ నటించిన మర్ద్ చిత్రానికి సంగీత దర్శకుడు అనూ మాలిక్‌తో కలిసి పనిచేశారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో కల్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, రాహుల్ దేవ్ బర్మన్, నౌషాద్, ఏపీ నయ్యర్, బప్పిలహిరి, రాజేష్ రోషన్, రామ్ లక్ష్మన్, రవీంద్రజైన్, ఆనంద్ మిలింద్ లాంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశాడు.

    Vetaran Singer Mohammad Aziz no more

    అమితాబ్ బచ్చన్, గోవింద, రిషీ కపూర్, మిథున్ చక్రవర్తి లాంటి హీరోలకు అజిజ్ పాటలు పాడారు. లతా మంగేష్కర్, ఆషా భోస్లే, అనురాధ పాడ్వల్, కవితా కృష్ణమూరి కలిసి ఎన్నో యుగళ గీతాలు పాడారు.

    అనిల్ కపూర్ నటించిన రామ్ లఖన్ చిత్రంలోని టైటిల్ పాట అజిజ్ పాడగా అత్యంత ప్రజాదరణ పొందింది. ఇలాంటి పాటలు తన కెరీర్‌లో ఎన్నో పాడారు.

    English summary
    Veteran singer Mohammad Aziz died in Mumbai’s Nanavati Hosptial on Tuesday. He was 64. The singer has lent his voice to over 2000 songs in Hindi, Bengali and Odia films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X