సినీ పరిశ్రమలో విషాదం.. కుళ్లిపోయిన స్థితిలో దొరికిన నటి మృతదేహం.. మృతికి కారణమేంటీ?

దాదాపు 40 ఏళ్ల పాటు బుల్లితెరపై అలరించిన ఓ నటి అత్యంత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం కూడా కుళ్లిపోయిన స్థితిలో పోలీసులకు దొరికింది. ఈ ఘటన చిత్ర పరిశ్రమలో విషాదాన్ని కలిగించింది. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని ఆయేషా ఖాన్‌గా గుర్తించారు. ఆమె మరణానికి కారణమేంటీ? వారం రోజులుగా ఆమె మృతదేహం ఫ్లాట్‌లోనే ఉన్నా ఎవరు గుర్తించకపోవడం ఏంటీ? ఈ వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై అగ్రనటిగా
పాకిస్తాన్‌కు చెందిన ఆయేషా ఖాన్ (76)బుల్లితెరపై అగ్రనటిగా వెలుగొందారు. ఆగస్ట్ 22, 1948న సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో ఆమె జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ కరాచీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయేషా ఖాన్ 1964లో తొలిసారిగా నటనా రంగంలో అడుగుపెట్టారు. ఆమెకు సోదరి ఖాలిదా రియాసత్ ఉన్నారు. ఈమె కూడా టెలివిజన్ నటే. 30 ఏళ్ల క్రితం క్యాన్సర్‌తో ఖాలిదా కన్నుమూశారు. పీటీవీలో సెటైరికల్‌ రోల్స్‌‌తో ఆయేషా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి అగ్రనటులు తలాత్ హుస్సేన్, మన్సూర్ ఖురేషి, ఖాజీ వాజిద్‌తో ఆయేషా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Veteran Pakistani actor Ayesha Khan Passed Away body found in a decomposed state

భారత్‌లోనూ నటించిన ఆయేషా
అఖ్రీ చాట్టన్, టిప్పు సుల్తాన్ ది టైగర్ లార్డ్, బోల్ మెరీ మచ్చి, ఏక్ ఔర్ ఆస్మాన్ తదితర సీరియల్స్ ఆయేషాకు గుర్తింపు తీసుకొచ్చాయి. బుల్లితెరతో పాటు వెండితెర మీద ఆమె మెరిశారు. ముస్కాన్, ఫాతిమాలలో నటించారు. అంతేకాదు.. ఆయేషా ఖాన్ ఓ భారతీయ సినిమాలోనూ భాగమయ్యారు. అదే రాజు బన్ గయా జెంటిల్‌మెన్. ఆయేషాకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలను బట్టి తెలుస్తోంది. వృద్ధాప్యంతో గత కొన్నేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోన్న ఆయేషా ఖాన్ .. కరాచీ నగరంలోనగుల్షన్ ఈ ఇక్బాల్ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు.

ఫ్లాట్ నుంచి దుర్వాసన
గత కొద్దిరోజులుగా ఓ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. కుళ్లిపోతున్న స్థితిలో ఓ వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆమెను ఆయేషా ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కరాచీలోని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ఆయేషా ఖాన్ మరణానికి ఖచ్చితమైన సమయం, కారణం ఇంకా తెలియరాలేదు. చట్టపరమైన లాంఛనాలు ముగిసిన తర్వాత ఆమె మృతదేహాన్ని సోహ్రాబ్ గోత్‌లోని ఎధీ ఫౌండేషన్‌ మార్చురీకి తరలించనున్నారు.

ఆయేషాది హత్యా? ఆత్మహత్యా?
ఆయేషా ఖాన్‌ను ఎవరైనా హత్య చేశారా? లేక ఆయేషా ఖాన్ ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు వారం క్రితమే ఆమె మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే కానీ మరణానికి ఖచ్చితమైన కారణం తెలియరాదు. మరోవైపు ఆమె మరణం పట్ల పాకిస్తాన్ చిత్ర పరిశ్రమ, బుల్లితెర వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయేషా ఖాన్ మరణం పట్ల సంతాపం తెలిపారు. త్వరలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: ayesha khan pakistan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X