For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ నెక్స్ట్ మూవీ ఖరారు.. ఫన్నీ టైటిల్, దర్శకుడు ఎవరంటే!

    |

    మాస్ మహా రాజా దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. ఇటీవల రవితేజ చిత్రాల విజయాల శాతం తగ్గినా దర్శక నిర్మాతలు రవితేజ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రవితేజ అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత రవితేజ కొత్త చిత్రం డిసెంబర్ లో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ తో రవితేజ ఓ చిత్రానికి కమిటై ఉన్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శత్వంలో రూపొందబోయే చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

    VI Anand ready to direct Ravi Teja

    ఈ చిత్రానికి డిస్కో రాజా అనే ఫన్నీ టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాల షూటింగ్ సమాంతరంగా నిర్వహిస్తారేమో చూడాలి.

    English summary
    VI Anand ready to direct Ravi Teja. Disco Raja is tentative title
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X