twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'యురి ది సర్జికల్ స్ట్రైక్' చిత్రానికి ముఖ్యమంత్రి గిఫ్ట్!

    |

    విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో నటించిన యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం భారీ వసూళ్లతో, అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఘనవిజయం సాధించగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గిఫ్ట్ అందించారు. యురి చిత్రానికి వినోదపు పన్ను తమ రాష్ట్రలో మినహాయిస్తున్నట్లు యోగి ప్రకటించారు. యురి చిత్రం ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేలా ఉందని యోగి ప్రశంసలు కురిపించారు.

    యురి చిత్రంలో విక్కీ కౌశల్ ఆర్మీ మేజర్ పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు. యామి గౌతమ్, పరేష్ రావల్, మోహిత్ రైనా కీలక పాత్రల్లో నటించారు. 2016 సెప్టెంబర్ లో పాక్ ఉగ్రవాదులు రహస్యంగా ఇండియా బోర్డర్ లోకి ప్రవేశించి యురి ప్రాంతంలో మన సైన్యంపై దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

    Vicky Kaushal film Uri tax-free in Uttar Pradesh, announces Yogi Adityanath

    దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ జరపాలని నిర్ణయించింది. ఇండియన్ ఆర్మీ గుట్టు చప్పుడు కాకుండా పీవోకే లోకి ప్రవేశించి ఉగ్రవాదుల స్థావరాలని నేలమట్టం చేసి దాదాపు 40 మంది టెరర్రిస్టులని మట్టబెట్టి తగిన ప్రతీకారం తీర్చుకుంది. అప్పట్లో సర్జికల్ స్ట్రైక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం ఆధారంగానే దర్శకుడు ఆదిత్య ధార్ యురి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

    English summary
    Vicky Kaushal film Uri tax-free in Uttar Pradesh, announces Yogi Adityanath
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X