వెంకీ గోల్డెన్ హ్యాండ్.. విక్టరీ చేతుల మీదుగా మిస్ మ్యాచ్ టీజర్
అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థలో తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్రంలో తొలిప్రేమ పాటను రీమేక్ చేయడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. దాంతో విభిన్నమైన చిత్రంగా ముద్ర వేసుకొన్నది.
మిస్ మ్యాచ్ సినిమా ప్రమోషన్ భారీగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమా టీజర్‌ను విక్టరీ వెంకటేష్ చేతులు మీదుగా ఆవిష్కరించనున్నారు. మిస్ మ్యాచ్ ట్రైలర్‌ను జూలై 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్బంగా నిర్మాతలు జీ శ్రీరాం రాజు, కే భరత్ రామ్ మాట్లాడుతూ.. సినిమా టీజర్‌ను రిలీజ్ చేయమని కోరిన వెంటనే అంగీకరించిన వెంకటేష్ గారికి మా ధన్యవాదాలు. చిన్న సినిమా అని పట్టించుకోకుండా వెంకటేష్ మా సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం హ్యాపీగా ఉంది అని అన్నారు.
ఐశ్వర్య రాజేష్, ఉదయ్ శంకర్, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు
నిర్మాతలు: జీ శ్రీరాం రాజు, కే భరత్ రామ్
దర్శకత్వం: నిర్మల్ కుమార్
సంగీతం: గిఫ్టన్ ఇలియాస్,
కధ: భూపతి రాజా,
మాటలు: రాజేంద్రకుమార్, మధు;
ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర;
పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ;
కళా దర్శకుడు: మణి వాసగం


Click it and Unblock the Notifications











