మరో మల్టీస్టారర్‌లో వెంకటేష్.. దర్శకుడు, హీరో ఎవరంటే?
విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఎఫ్2 - ఫన్ అండ్ ప్రస్టేషన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరో మల్టీస్టారర్‌కు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్‌తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలిసి నటిస్తున్నాడు.
ఎఫ్2 సినిమా తర్వాత కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించే చిత్రంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి వెంకీ మరో చిత్రంలో నటించనున్నారు.

అదే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించే మరో మల్టీస్టారర్ చిత్రంలో వెంకటేష్ నటించనున్నారు. ఈ చిత్రంలో మరో పాపులర్ హీరో వెంకీతో నటిస్తారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్నది.
అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్, త్రినాథరావు, వెంకీ అట్లూరీ రూపొందించే సినిమాల్లో కూడా నటించేందుకు విక్టరీ వెంకటేష్ పచ్చ జెండా ఊపారు. అవి కూడా పట్టాలెక్కించే ప్రయత్నం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











