twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహర్షి ప్రీరిలీజ్‌కు డబుల్ ధమాకా.. ముఖ్య అతిథులుగా టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరో.. విజయ్ దేవరకొండ

    |

    సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే..

    నెక్లెస్ రోడ్డులో భారీ ఏర్పాట్లతో

    నెక్లెస్ రోడ్డులో భారీ ఏర్పాట్లతో

    అభిమానుల భారీ అంచనాల మధ్య మహర్షి చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల మధ్య ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన జ్యూక్ బాక్స్‌ను విడుదల చేశారు.

     వెంకటేష్ కాలుపెడితే బ్లాక్‌బస్టరే

    వెంకటేష్ కాలుపెడితే బ్లాక్‌బస్టరే

    మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇటీవల కాలంలో పలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెంకటేష్ హాజరు కాగా ఆ చిత్రాలు భారీ విజయాలు అందుకొన్నాయి. మజిలీ, జెర్సీ సినిమాకు వికర్టీ వెంకటేష్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు వెంకీ గోల్డెన్ లెగ్‌గా మారిపోయారు.

     అప్పుడు జూ.ఎన్టీఆర్.. ఇప్పుడు వెంకటేష్

    అప్పుడు జూ.ఎన్టీఆర్.. ఇప్పుడు వెంకటేష్

    యువ, సీనియర్ హీరోలతో సూపర్ స్టార్ మహేష్ బాబు సన్నిహితంగా ఉంటారనేది అందరికి తెలిసిందే. విక్టరీ వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించాడు. గతంలో భరత్ అనే నేను సినిమాకు జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ రావడం మరింత ఆసక్తిగా మారింది. ఈవెంట్ మరింత సందడిగా మారే అవకాశం ఉంది.

    మహర్షీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు విజయ్ దేవరకొండ

    మహర్షీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు విజయ్ దేవరకొండ

    మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారల సందడి భారీగానే ఉండనున్నది. ఈ సినిమా ఫంక్షన్‌కు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా హాజరు కానున్నారు. వైజయంతి మూవీస్‌లో విజయ్ దేవరకొండ నటించడం ఓ కారణంగా కాగా, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా విజయ్‌కి సన్నిహితుడు కావడం ఆయన హాజరుకు మరో కారణమైంది.

    క్రేజీగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్

    క్రేజీగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్

    మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

    English summary
    The runtime of director Vamsi Paidipally's Maharshi starring Mahesh Babu and Pooja Hegde. This movie music already big hit in tollywood. Now film unit released juke box before pre release event of the Maharshi. Venkatesh attending as guest for pre release event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X