Venkatesh Daughter engagement Photos వెంకటేష్ కూతురు నిశ్చితార్థం: చిరంజీవి, మహేష్ బాబు, ఇంకా ఎవరొచ్చారంటే?
టాలీవుడ్‌లో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురు వివాహా నిశ్చితార్థం ప్రైవేట్ కార్యక్రమంగా అత్యంత గోప్యంగా జరిగింది. రెండు కుటుంబాలతోపాటు సినీ రంగానికి చెందిన కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో ఎవరు హాజరయ్యారు? వెంకటేష్ కూతురుకు కాబోయే భర్త ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
వెంకటేష్ దగ్గుబాటి రెండో కూతురు హయవాహిని వివాహ నిశ్చితార్థం విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో జరిగింది. పెళ్లి కొడుకు వివరాలను, వారి కుటుంబ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. అత్యంత సీక్రెట్‌గా హయవాహిని దగ్గుబాటి ఎంగేజ్‌మెంట్ అక్టోబర్ 25వ తేదీ రాత్రి జరిగింది. అయితే మీడియాకు, ఇతర వర్గాలకు తెలియకుండా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించారు.

హయవాహిని నిశ్చితార్థ వేడుకలో అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే కనిపించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, నాగచైతన్య, రానా దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు.
హయవాహిని ఎంగేజ్‌మెంట్ వేడుకలో నాగచైతన్య, రానా దగ్గుబాటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మహేష్ బాబు సతీసమేతంగా వచ్చి అతిథులను ఆకట్టుకొన్నారు. మహేష్ బాబు ఎప్పటి మాదిరిగానే చాలా సింపుల్‌గా కనిపించారు.

వెంకటేష్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అశ్రిత, హయవాహిని, భావన, అర్జున్ సంతానం ఉన్నారు. అశ్రిత వివాహం 2013లో వరంగల్ మాజీ ఎంపీ సురెందర్ రెడ్డి మనువడు వినాయక్ రెడ్డితో జరిగిన విషయం తెలిసిందే.



Click it and Unblock the Notifications











