వెంకటేష్‌కు హీరోయిన్ దొరికింది.. వెంకీ మామ సినిమా కోసం!
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రంలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. వెంకటేష్ మరో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా మల్టీస్టారర్ చిత్రాన్ని దరకుడు బాబీ చాలా రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంత వరకు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎట్టకేలకు ఈ చిత్రంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. వెంకీ మామ అనే ఫన్నీ టైటిల్ తో బాబీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
ఫిబ్రవరి నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టం. చాలా కసరత్తు తర్వాత వెంకటేష్ కోసం శ్రీయని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వెంకీ, శ్రీయ ఇప్పటికే సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల చిత్రాల్లో నటించారు. ఈ చిత్రంలో వెంకీ, నాగ చైతన్య పాత్రలో చాలా సరదాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

నాగ చైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ తో కలసి రచయిత కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జైలవకుశ లాంటి విజయవంతమైన చిత్రం తర్వాత బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











