Saindhav Trailer Review: వామ్మో ఈ సైకో మళ్లీ వచ్చాడు.. వణుకు పుట్టించేలా సైంధవ్ ట్రైలర్

ఈసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాల్లో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమా ఒకటి. ఇక ఈ సినిమా వెంకటేశ్ కు 75వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉంది. ఇక సంక్రాంతికి వెంకటేష్ హిట్ ఖాయమని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం...

విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'హిట్‌' సిరీస్ దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తుండగా... వెంకటేశ్ కు ఈ సినిమా 75వ చిత్రం. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు.

Recommended Video

Venky 75 Saindhav Trailer Review గణేష్ స్థాయి హిట్ పక్కా | Telugu Filmibeat

Victory Venkatesh Sailesh Kolanu Saindhav Movie Trailer Released Full Review Here

ఇప్పటికే సంక్రాంతికి మహేశ్ గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామి రంగ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు.. రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక వీరందరికీ పోటీగా వెంకటేశ్ నటిస్తున్న సైంధవ్ సినిమా కూడా రాబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా వెంకటేశ్ కెరియర్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

విడుద‌ల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీం.. ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్లు రిలీజ్ చేయగా మంచి ఆదరణ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ అందించారు. ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల రన్‌ టైమ్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. న్యూ ఇయ‌ర్ కానుక‌గా సైంధ‌వ్ ట్రైల‌ర్‌ ను జ‌న‌వ‌రి 03న రిలీజ్ చేశారు.

Victory Venkatesh Sailesh Kolanu Saindhav Movie Trailer Released Full Review Here

సైంధవ్ ట్రైలర్ నిడివి మూడు నిమిషాల 36 సెకన్లుగా ఉంది. ఇక ట్రైలర్ ప్రారంభంలో ఒక ఇంగ్లీష్ సాంగ్ తో సింపుల్ గా ప్రారంభం అవుతుంది. వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పుకువస్తుంది. మరోవైపు వెంకటేష్ కిరాతకంగా చంపుకుంటూ వస్తాడు. మా నాన్న ఉంటే నాకేం భయం కాదు.. అంటూ పాప చెబుతూ ఉంటుంది. శ్రధ్దా శ్రీనాధ్, వెంకటేష్, కూతురు హ్యాపీగా సాగుతున్న వారి లైఫ్ లో ఓ సమస్య వస్తుంది. పాప జబ్బు బారిన పడుతుంది. అది నయం కావాలంటే.. 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి.

కట్ చేస్తే... సైకో ఈజ్ బ్యాక్ అంటూ విలన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. నవాజుద్దీన్ సిధ్దిఖి ఇందులో విలన్ గా నటిస్తుండగా.. వెంకటేష్ యాక్షన్స్ సీక్వెన్స్ లు ఆకట్టుకుంటున్నాయి. నా తల తీసుకువస్తే డబ్బులు ఇస్తామని చెప్పారా.. నా తల తీసుకురావాలంటే.. మీ తలలు ఉండాలి కదరా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక సైంధవ్ వచ్చిన వెంకటేష్ తన పాపను ఎలా కాపాడుకున్నాడు.. విలన్స్ ను ఎలా అంతం చేశాడు.. ఎందుకు సైకోగా మారి హత్యలు చేస్తున్నాడు అనేది తెలియాలంటే.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ట్రైలర్ చివరలో పాప నిద్రపోతుంది.. దగ్గరకు వస్తే చంపేస్తా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ హైలెట్. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిహారిక ఎంటర్‌ టైన్మెంట్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X