For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చిన్న సినిమాకు వెంకటేష్ సపోర్ట్.. 4 లెట‌ర్స్‌కు ఆశీస్సులు.. మూవీ గురించి ఏమన్నారంటే..

  |

  ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం 4 లెట‌ర్స్‌. 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్టీ జర్, ట్రైలర్ ను చూసి చిత్ర కథానాయకుడు,దర్శక, నిర్మాతలను అభినందించి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని "A ' సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 22 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా...నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడారు.

  రాఘవేంద్రరావు చేతుల మీదుగా టీజర్

  రాఘవేంద్రరావు చేతుల మీదుగా టీజర్

  మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం టీజర్‌ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్రరావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం అని నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ అన్నారు.
  విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని హీరో ఈశ్వర్ తెలిపారు.

  ప్రేమ, పెళ్లి విషయాలలో యూత్

  ప్రేమ, పెళ్లి విషయాలలో యూత్

  ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ `క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌. `4 లెట‌ర్స్‌`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది అని
  అన్నారు.

  మేకింగ్‌లో కాంప్రమైజ్ కాకుండా

  మేకింగ్‌లో కాంప్రమైజ్ కాకుండా

  చిత్ర కథ,కథనాలు, సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటంతోపాటు, ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం అని ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ పేర్కొన్నారు.

   నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు: ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణం
  సాంకేతిక నిపుణులు:
  కో డైరెక్ట‌ర్‌: రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి,
  ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: సి.భాస్క‌ర్ రాజు,
  పాట‌లు: సురేశ్ ఉపాధ్యాయ‌,
  కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌,
  స్టిల్స్: అన్బు,
  డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌,
  ఆర్ట్‌: వ‌ర్మ‌,
  మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో,
  సినిమాటోగ్ర‌ఫీ: చిట్టిబాబు.కె

  నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్,

  క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్

  English summary
  '4 Letters' stars Eswar as the male lead. Directed by R Raghu Raj and produced by Dommaraju Hemalatha, Dommaraju Udaykumar on Sri Chakra Creations, the youthful film's audio is out. The audio event was held in Hyderabad on Wednesday. The rom-com also stars Tuya Chakraborthy, Anketa Maharana, Kausalya, Annapurna, Sudha and others. The logo of the new banner was launched by producer 'Gemini' Kiran. Director SV Krishna Reddy unveiled the Trailer. The big CD was launched by Acchi Reddy and Krishna Reddy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more