అల్లు అర్జున్ సినిమా పాటకు స్టెప్పులేసిన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!

పాన్ ఇండియా ఇండస్ట్రీలో సరికొత్త విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప సినిమా ఏ స్థాయిలో క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణ వ్యక్తుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకూ చాలామంది పుష్ప సినిమాలోని స్టైల్ ను బయట ప్రపంచంలో కూడా అదే తరహాలో వాడుతున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలకు కూడా భారీ స్థాయిలో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు అన్నీ కూడా మార్కెట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాయి. దాంతో సినిమాకు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. మొదటిసారి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో హిందీ మార్కెట్ లో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

ఇక పుష్ప సినిమాలోనే ఐటెం సాంగ్ కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. సమంతా స్పెషల్ ఎట్రాక్షన్ గా చేసినటువంటి ఊ అంటావా.. పాట యూట్యూబ్ లోనే సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ పాటకు ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ప్రత్యేకంగా స్టెప్పులు వేయడం విశేషం. ఊ ఉంటావా పాట హిందీలో కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ తెలుగు ఐటమ్ సాంగ్ పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఒక పార్టీలో విరాట్ కోహ్లీ ఈ విధంగా స్టెప్పులు వేయడంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

video of Virat Kohli dancing to pushpa movie item song

ఏకంగా భారత మాజీ కెప్టెన్ పుష్ప పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటకు స్థాయిలో గుర్తింపు లభించిందో అర్థమవుతోంది. తప్పకుండా సెకండ్ పార్ట్ కు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది అని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాను మొదట కేవలం ఒక భాగం తోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిడివి చాలా ఎక్కువయ్యింది అని అనవసరంగా ఎడిటింగ్లో తీసేయడం బాగుండదు అనే కారణంచేత రెండు భాగాలుగా సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇక సెకండ్ పార్ట్ షూటింగ్ అయితే దాదాపు 80 శాతం పూర్తి చేశారు. ఇక మిగిలిన 20 శాతం పూర్తి చేయడానికి పెద్దగా సమయం పట్టదు. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం సెకండ్ పార్ట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మరొకసారి కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. మొదటి పార్ట్ ను భారీ స్థాయిలో క్రేజ్ అందుకోవడంతో సెకంప్ పార్ట్ పై అంచనాలు గట్టిగా ఉన్నాయి అని అందుకే ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా విడుదల చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో పుష్ప 2 సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ కుదరకపోతే వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయవచ్చు అని సమాచారం. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇంకా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X