SS Rajamouli: మాది ఆర్య 2 లవ్ స్టోరి.. అందుకే రాజమౌళి టార్చర్‌.. జక్కన్న స్నేహితుడు మరణ వాగ్మూలం వీడియో!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా వరల్డ్ సినిమాను ప్రభావితం చేస్తున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, RRR సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా జెండాను రెపరెపలాడించాడు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని షూట్ చేస్తున్నాడు. ఇలా తన సినిమా పనిలో బిజీగామారిన జక్కన్నపై ఆయన స్నేహితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనపై సంచలన ఆరోపణలు చేస్తూ మరణ వాగ్మూలం వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో పూర్తి సారాంశం విషయానికి వస్తే..

ఇండియాస్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను మరణ వాగ్మూలం ఇస్తున్నాను. వీడెంటి పబ్లిసిటీ కోసం మరణవాగ్మూలం ఇస్తున్నాడని అనుకోవద్దు. కీరవాణి, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి తదితరుల వద్ద పనిచేశాను. వీరిందరికి మా ఫ్రెండ్ షిప్ గురించి తెలుసు అని యూ శ్రీనివాస రావు అనే వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు.

Video SS Rajamouli Friend U Srinivasa Rao released death warrant Video before Suicide attempt

మాది 1990 నుంచి ఫ్రెండ్ షిప్ ఉంది. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్ షిప్. రామాయణం, మహాభారతం యుద్దాలకు కారణం ఆడవాళ్లు అనేది అందరికి తెలుసు. ఓ అమ్మాయి వల్ల ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అందరి జీవితంలో మాదిరిగానే మా లైఫ్‌లోకి ఓ అమ్మాయి ప్రవేశించింది. మా మధ్యలోకి రమ రాజమౌళి వచ్చింది. దాంతో మా స్టోరి ఆర్య 2 లా మారింది అని ఆయన తన వీడియోలో పేర్కొన్నారు.

రమ రాజమౌళి మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేద్దామని రాజమౌళిని నేను అడిగాను. రమ రాజమౌళి కోసం నీవు త్యాగం చేయాలని అన్నాడు. దాంతో అలా ఎలా కుదురుతుంది. ముగ్గురం కలిసి ఉందామని అన్నాను. దాంతో అది దారుణంగా ఉంటుంది అని రాజమౌళి అన్నారు. నేను కూడా పెళ్లి చేసుకొంటాను. మనం నలుగురం కలిసి ఉందాం అని అన్నాను. అప్పుడు ఇంకా చెండాలంగా ఉంటుంది. సమాజం ఒప్పుకోదని అన్నాడు. మరి పరిస్థితి ఏమిటంటే.. కాలమే సమాధానం చెబుతుంది అని అన్నాడని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఆ తర్వాత రాజమౌళి నన్ను త్యాగానికి సిద్దపడాలని కోరాడు. సరే అని నేను సాక్రిఫైజ్ అయ్యాను. ఇదంతా శాంతి నివాసం సీరియల్‌కు ముందు జరిగిన కథ. అప్పడు రాజమౌళి కెరీర్ ఇంత పీక్స్‌కు వెళ్లలేదు. చిన్న చిన్న గొడవలకు కాంట్రవర్సిగా చేయడం ఎందుకని.. నేను సైలెంట్ అయ్యాను. సినిమాలు చేసుకొంటూ వచ్చాను అని ఆయన తెలిపారు.

అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. వాడు నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు. గతంలో జరిగిన విషయాలన్నీ ఎవరికో చెప్పాననుకొని నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు అని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. దీనిపై రాజమౌళీ గానీ, ఆయన సతీమణి రమ రాజమౌళి గానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: ss rajamouli tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X