నిర్మాతగా మారిన కహానీ బ్యూటీ
వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు జనాలను సరికొత్తగా అలరిస్తున్న విద్యాబాలన్ ఇప్పుడు నిర్మాతగానూ తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. సినీ నిర్మాణంలో అడుగుపెట్టాని ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతున్న విద్యా, ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా తన ముచ్చటను తీర్చేసుకుంది. స్వీయనిర్మాణంలో నట్ కట్ అనే లఘుచిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం మానవ కంప్యూట్ గా పేరుగాంచిన శకుంతలా దేవి బయోపిక్ లో నటిస్తున్న విద్య, తన లఘు చిత్రం నట్ కట్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఇందులో గ్రామీణ మహిళ కట్టుబొట్టుతో దర్శనమిస్తున్న విద్య, ఓ చిన్నారికి తైల సంస్కారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టీ ఈ లఘుచిత్రంలో పెద్ద విషయమే ఉందని తెలుస్తోంది.

మామూలుగానే అద్భుతమైన నటనతో కట్టిపాడేసే విద్యాబాలన్, తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ లో ఏ రేంజ్ లో ఇరగదీసి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ లుక్ విడదలైన గంటల వ్యవధిలోనే అది వైరల్ గా మారిపోయింది. రోనీ స్క్రూవాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లఘుచిత్రం త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదల కానుంది. మరోవైపు విద్య నటించిన శకుంతలా దేవి బయోపిక్ కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
vidhya balan producer short film natkhat first look release విద్యాబాలన్ ఫస్ట్ లుక్ నిర్మాత షార్ట్ ఫిల్మ్ నట్ కట్


Click it and Unblock the Notifications