Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సినిమాకు ఆదరణ దక్కలేదని.. విద్యాబాలన్ మనస్తాపం..
దేశ సినీ పరిశ్రమలో అవార్డులకు, రివార్డులకు అర్హత ఉన్న ప్రతిభావంతమైన తారల్లో విద్యాబాలన్ ఒకరు. అయితే ఆమె ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోతారు. అయితే ఓ చిత్రంలో ఓ మంచి పాత్రలో నటించినప్పుడు అవార్డు వస్తుందని అనుకొన్నాను. కానీ రాకపోయేసరికి కొంత అసంతృప్తి కలిగింది అని విద్యా బాలన్ తెలిపారు,
భూల్ భులయ్య అనే చిత్రంలో మంచి పాత్రలో నటించాను. కానీ ఆ పాత్రకు గానీ, సినిమాకు గానీ అవార్డు రాకపోవడం చాలా షాక్ గురిచేసింది అని ముంబయిలో క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డ్స్ నామినేషన్లో కామెంట్ చేసింది. భూల్ భులయ్యా చిత్రం 2007లో విడుదలైంది. తెలుగులో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. అక్షయ్ కుమార్ టైటిల్ పాత్రలో కనిపించారు.
భూల్ భులయ్య చిత్రంలోని నా పాత్రను ఏ అవార్డుకు నామినేట్ చేయలేదు. నా పాత్ర బాగుందని సినీ విమర్శకులు చెప్పారు. అయితే రాకపోవడంతో జీవితంలో అవన్నీ సాధారణమే అని సర్ధిచెప్పుకొన్నాను అని విద్యాబాలన్ చెప్పింది.
తాజాగా నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకంగా నటించారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రజాదరణ లభించింది. అయితే ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు.
'